శనివారం 16 జనవరి 2021
Health - Nov 23, 2020 , 22:26:53

యోగ నిద్ర అంటే ఏంటి? ఎలా చేయాలి?

యోగ నిద్ర అంటే ఏంటి? ఎలా చేయాలి?

నాలుగు గంటలు రెస్ట్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ కేవలం 20నిమిషాలు యోగా సెషన్ ద్వారా దక్కించుకోవచ్చు. దీన్నే యోగ నిద్ర అంటారు. మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా.. కష్టమే. ఎందుకంటే మీరనుకుంటున్న యోగాకు విరుద్ధంగా ఉంటుంది ఇది. రకరకాల భంగిమలు చూసి అలా చేయాలి.. ఇలా చేయాలి అనుకుంటుండొచ్చు. ప్రాక్టీషనర్లు మాత్రం దీన్ని నేలపై పడుకుని చేయమని చెబుతున్నారు. 

ఫ్లోరిడాలోని సాల్ట్ స్ప్రింగ్స్ అమృత్ యోగా ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కామినీ దేశాయ్ ఇది చాలా తేలికగా ఎలా చేయొచ్చని సూచిస్తున్నారు. ఎలాగో తెలుసుకుందాం పదండి.. 

యోగ నిద్ర ఎలా చేయాలంటే.. 

మీరు వెల్లకిలా పడుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. ఇందులో శవాసనం చాలా ఫేవరేట్ యోగా ఫోజ్ అన్నమాట. మీ తలకు దిండు కూడా వాడుకోవచ్చు. మోకాళ్ల కింద కాస్త ఎత్తైనది ఉంచుకోండి ఓ దుప్పటి పెట్టినా సరిపోతుంది. అక్కడి నుంచి మీ శ్వాసపై అవగాహన పెంచుకోండి. 

శరీర భాగాల్లో జరుగుతున్న మార్పులను ఒక్కొక్కటిగా గమనించండి. మీ కాలి బొటనవేలి నుంచి స్టార్ట్ చేసి తల వరకూ ఫీల్ అవ్వాలి. ఇలా వెంటనే కాదు. ఒక్కొక్క భాగంపై ఆలోచన కాస్త సేపు ఆపి ఉంచుతూ కంటిన్యూ చేయాలి. ఇలా 20 నుంచి 45నిమిషాల సేపు రోజూ ప్రాక్టీస్ చేస్తే మెదడు నుంచి సిగ్నల్స్ ప్రతి భాగానికి చేరి శరీరం రిలాక్స్ అవుతుంది. 

నిజంగా  యోగనిద్ర పనిచేస్తుందా?

యోగా నిద్రను డీప్ రిలాక్సేషన్ కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం, మంచి నిద్ర కోసం అలవాటు చేసుకుంటారు. ఇది పనిచేసేందనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 2018లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా స్టడీ అభ్యర్థులు వారానికి రెండు సార్లు 45నిమిషాల పాటు మూడు నెలలు ప్రాక్టీస్ చేశారు. ఫలితంగా వారిలో ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటుతనం అంతకంటే ముందున్న స్థాయి కంటే తక్కువగా కనిపించాయి. రీసెర్చర్లకు కూడా యోగ నిద్ర ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా అనిపించింది. 

దీని వల్ల హ్యాపీ హార్మోన్ 'డోపమైన్' కూడా ఉత్పత్తి అయినట్లు తెలిసింది. దీని వల్ల మూడు రెగ్యూలేట్ అవడం, అటెన్షన్, నిద్ర ప్రవర్తనలో మార్పు కనిపించాయి. ఒత్తిడి పెరిగిపోతున్న వారు ఈ యోగనిద్రను అలవాటు చేసుకుని పలు వ్యసనాల నుంచి బయటపడ్డారు.