బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Mar 23, 2020 , 12:09:54

కరోనా వైరస్‌.. థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అంటే ఏంటి?

కరోనా వైరస్‌.. థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అంటే ఏంటి?

ఎయిర్ పోర్ట్‌, రైల్వై స్టేష‌న్‌, కార్పొరేట్ కంపెనీస్ ఎక్క‌డ  చూసినా థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ ప‌రీక్ష‌లే. ముఖ్యంగా విమాన ప్ర‌యాణం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఎయిర్ పోర్ట్ అధికారులు థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అస‌లు థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అంటే ఏంటి?

 క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తి 7 నుంచి 10 రోజుల మ‌ధ్య‌లో తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. కానీ ముందే గుర్తించి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల దీన్ని అరిక‌ట్ట‌వ‌చ్చు.  ప్ర‌జ‌ల‌కు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా కరోనావైరస్ లేదా అలాంటి ఏ వ్యాధితో ఉన్న బాధితుడినైనా గుర్తించవచ్చు. నిజానికి థర్మల్ స్క్రీనింగ్  చేయ‌డం ద్వారా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి, ఏదైనా వైరస్ వ్యాపించిన వ్యక్తులకు స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఈ టెస్ట్ అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను వెంట‌నే డిటెక్ట్ చేయ‌గ‌ల‌దు. ఈ స్క్రీనింగ్ నుంచి వచ్చే తరంగాల వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభవాలు కూడా ఉండవు. అయితే దీనిని నిపుణుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ ప్రక్రియలో ప్రజలు ఒక స్కానర్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వ్యక్తి శరీరంలో ఉష్ణోగ్రత ఆధారంగా అనుమానిత రోగుల గురించి తెలుస్తుందీ ఆ స్కాన‌ర్‌. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితో పోలిస్తే వైరస్ బాధిత వ్యక్తుల శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఉంటే అనుమానితులను వైద్య పరీక్షల కోసం పంపించవచ్చు. దానితోపాటు ఈ థర్మల్ స్కానర్ ఒక ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలా పనిచేస్తుంది. ఆ స్కానర్ నుంచి వెళ్లే వ్యక్తి శరీరంలో ఉన్న వైరస్ ఇన్‌ఫ్రారెడ్ ఫొటోల్లో కనిపిస్తుంది. వైరస్ ఎక్కువగా లేదా ప్రమాదకర స్థాయిలో ఉంటే వ్యక్తి శరీరం ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది.


logo
>>>>>>