గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిదో తెలుసా..?


Thu,December 28, 2017 02:46 PM

గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే గ్రీన్ టీని తాగడం మంచిదే అయినా అందుకు ఓ సమయం, కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటంటే...

గ్రీన్ టీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత 1 గంట ఆగాక మాత్రమే తాగాల్సి ఉంటుంది. లేదంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలను శరీరం గ్రహించకుండా గ్రీన్ టీ అడ్డుకుంటుంది. కనుక ఆహారం తీసుకున్న తరువాత ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగవచ్చు. ఉదయం 11 గంటలకు సాయంత్రం 4 గంటలకు గ్రీన్ టీ తాగితే మరీ మంచిది. అలాగే గ్రీన్ టీని రోజుకు 3 కప్పులకు మించి తాగకూడదు. తాగితే మన శరీరంలో ఉన్న ముఖ్యమైన పోషకాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ఇక నిద్రలేమి సమస్య ఉన్న వారు సాయంత్రం 6 తరువాత గ్రీన్ టీ తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫీన్ నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుంది.

10546

More News

VIRAL NEWS