డయాబెటిస్ ( Diabetes ) ఉన్నవారు తిండి విషయంలో చాలాసార్లు నోరు కట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుక ఆలోచించాల్సి ఉంటుంది. షుగర్ కారణంగా ఎలాగూ స్వీట్లు తినలేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాలన్నా ఎన్నో సందేహాలు. పండ్లలోనూ చక్కెరస్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి తినరాదు అనే అనుమానాలు చాలా ఉంటాయి. అయితే డయాబెటిస్ ( Diabetes ) ఉన్నప్పటికీ కొన్ని పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా తినొచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పుచ్చకాయ తియ్యగా ఉండటం వల్ల దీన్ని తినొచ్చా లేదా అని చాలామందికి ఓ సందేహం ఉంటుంది. అయితే పుచ్చకాయ విషయంలో ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్ రక్తంలో ఎంత వేగంగా కలుస్తుందనేదాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ)తో సూచిస్తారు. ఇది అధికంగా ఉండే పండ్ల విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుచ్చకాయలో జీఐ 72 శాతం ఉంటుంది. కానీ ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండి పిండిపదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నప్పుడు వెంటనే గ్లూకోజ్ పెరిగినప్పటికీ వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి నిరభ్యంతరంగా పుచ్చకాయను తినొచ్చు.
ప్రతిరోజు యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతుంటారు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక రసాయనం ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను సగానికి తగ్గిస్తుంది. దీని జీఐ 38 మాత్రమే. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు యాపిల్ తినడం మంచిదే. అయితే యాపిల్ పెద్ద సైజ్‌లో ఉంటే సగం తింటే చాలు.
ఆరెంజ్‌లో జీఐ తక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్, బీటాకెరోటిన్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ రోగుల్లో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో దోహదం చేస్తాయి.
దానిమ్మలో జీఐ 18గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలోని చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
షుగర్ వ్యాధికి జామ మంచి ఔషధం. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. జామకాయలో విటమిన్ ఏ, సీతో పాటు వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
రేగు పండల్లో క్యాలరీలతో పాటు గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చు
డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయిని కచ్చితంగా తినాలి. ఇందులో హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి షుగర్ వ్యాధిగ్రస్తులను రక్షించే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కివీస్‌లో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి కివీస్ తినడం వల్ల డయాబెటిస్ తీవ్రత తగ్గుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటి బెర్రీస్ రుచికరంగా ఉండటమే కాకుండా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ జాబితాలో బెర్రీలను సూపర్ ఫుడ్‌గా గుర్తించారు. వీటిలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
“Hot Summer | హాట్ సమ్మర్లో మీ ఇంటిని ఇలా కూల్ కూల్‌గా మార్చేసుకోండి”
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు”
Taati munjalu | డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!
షుగర్ పేషెంట్లు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి..?”