శనివారం 11 జూలై 2020
Health - May 28, 2020 , 16:45:21

స్మెల్‌ బాగుందని శానిటైజర్లు ఎక్కువగా వాడుతున్నారా?

స్మెల్‌ బాగుందని శానిటైజర్లు ఎక్కువగా వాడుతున్నారా?

కొవిడ్‌-19 వ్యాధి నేపథ్యంలో చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు చాలామంది పదేపదే శానిటైజర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది మంచి సువాసన ఇస్తుందని చేతులు కడుక్కునేవారు చాలామందే ఉన్నారు. అయితే.. శానిటైజర్‌ను ఎక్కువగా వాడడం వల్ల కొన్ని అనర్థాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.

మంచి, చెడు అని బ్యాక్టీరియాలో రెండు రకాలుంటాయి. చేతులు ఎక్కువగా శుభ్రం చేసుకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా తొలిగిపోవడం మంచిదే. కానీ, దీనితోపాటు మంచి బ్యాక్టీరియా కూడా పోతుందంటున్నారు వైద్యులు. మంచి బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లకపోతే రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. చేతులు ఎక్కువగా సబ్బుతో శుభ్రపరుచుకుంటుంటే శానిటైజర్‌ వాడకాన్ని తగ్గించాలి. చేతులకు దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్నట్లయితే సబ్బు వాడడమే ఉత్తమం. ఎక్కువ మురికిని శానిటైజర్‌ తొలగించలేదు. అలాగే శానిటైజర్‌ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి. లేదంటే వారు తాగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.logo