బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Aug 22, 2020 , 17:41:12

రాత్రులు వేడినీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

రాత్రులు వేడినీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

ఈ రోజుల్లో చాలామంది ఉద‌యం పూట స్నానం చేసి రాత్రులు స్నానం చేయ‌కుండానే ప‌డుకుంటున్నారు. కొంత‌మంది మాత్రం అల‌సిపోవ‌డం వ‌ల్ల స్నానం చేస్తే రిలాక్స్ అవ్వొచ్చ‌ని స్నానం చేస్తున్నారు. కానీ అప్పుడు తేడా తెలుస్తుంది స్నానం చేసిన‌వారికి చేయ‌నివారికి. స్నానం చేసిన వారు తొంద‌ర‌గా నిద్ర‌లోకి జారుకుంటారు. చేయ‌ని వారు అటూ ఇటూ మ‌సులుతుంటారు. అంతేకాదు ఆ స్నాన‌మేదో గోరువెచ్చ‌ని నీటితో చేస్తే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలున్నాయింటున్నారు నిపుణులు. మ‌రి అవేంటో తెలుసుకుందాం.

* రాత్రివేళ‌లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిప‌తాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారుతుంది. అదే గోరువెచ్చ‌ని నీటితో స్నానం చేస్తే శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను పెంచుతుంది. 

* ఇలా చేయ‌డం వ‌ల్ల మెల‌టోనిన్ అనే స్లీపింగ్ హార్మోన్‌ను ప్రేరేపించి గాఢ నిద్ర వ‌చ్చేలా చేస్తుంది.

* గోర‌వెచ్చ‌ని నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీర కండ‌రాలు విశ్రాంతి తీసుకుంటాయి.

* టైప్ 2 డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు రాత్రి స‌మ‌యంలో గోరువెచ్చ‌ని నీటితో స్నానం చేస్తే ఫ‌లితం ఉంటుంది.

* ర‌క్త‌పోటును త‌గ్గించుకోవాలంటే రాత్రిపూట గోరువెచ్చ‌ని నీటితోనే స్నానం చేయాలి.

* గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ముఖ్యంగా వేడి నీటితోనే స్నానం చేయాలంటున్నారు.

* వేడి నీరు మంచిది క‌దా అని మ‌రీ వ‌ళ్లు కాలేంత‌లా పోసుకోకూడ‌దు. గోరువెచ్చ‌గా ఉంటే స‌రిపోతుంది. అంటే.. నీటి ఉష్ణోగ్ర‌త శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను మించ‌కూడ‌దు.  

 


logo