రోజుకో అరటి పండును తింటే ఏమవుతుందో తెలుసా..?


Sun,May 7, 2017 02:49 PM

అరటి పండు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి మనకు కావల్సిన పోషకాల లోటును భర్తీ చేస్తాయి. అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే నిత్యం ఒక అరటి పండును తింటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ ఒక అరటి పండును తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. అరటి పండ్లలో ఉండే మెగ్నిషియం కండరాలు దృఢంగా మారేందుకు ఉపయోగపడుతుంది.

2. వ్యాయామం చేసే వారికి మంచి శక్తిని ఇస్తుంది. దీంతో ఎక్కువ సేపు వ్యాయామం చేయవచ్చు. తద్వారా శరీరానికి మంచి ఫిట్‌నెస్ అందుతుంది.

3. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి9 మన శరీరంలో సెరటోనిన్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. మూడ్ మారుతుంది.

4. అరటి పండ్లలో ఉండే పోషకాలు నిద్రలేమి సమస్యను పోగొడతాయి. నిద్ర సరిగ్గా పట్టని వారు రోజుకో అరటి పండును తింటే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

5. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు పోతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ ఆ సమస్యలను దూరం చేస్తుంది.
banana
6. రోజుకో అరటి పండును తింటే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవ్వును కరిగించే హార్మోన్లు అరటి పండ్ల వల్ల యాక్టివేట్ అవడమే అందుకు కారణం.

7. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. జీర్ణాశయంలో ఉండే చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా పెరుగుతుంది.

8. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

9. అరటి పండ్లలో కాల్షియం లేకపోయినా వాటిలో ఉండే పోషక ప‌దార్థాలు శరీరంలో కాల్షియం తయారయ్యేందుకు ఉపయోగప‌డ‌తాయి. అందువల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

7633

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles