వేగంగా భోజనం చేస్తే ఏమౌతుంది..?

హైదరాబాద్: మనలో అధిక శాతం మంది చాలా వేగంగా భోజనం చేస్తుంటారు. అదేమిటని అడిగితే.. పని ఉందనో, ఎక్కడికైనా వెళ్లాలనో.. లేదా తాము అలాగే తింటామనో.. మరే ఇతర కారణాలు చెబుతుంటారు. కానీ నిజానికి ఎవరైనా సరే.. భోజనం వేగంగా చేయకూడదు. చాలా నెమ్మదిగా తినాలి. అయితే వేగంగా భోజనం చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయంటే...
-వేగంగా భోజనం చేయడం వల్ల ఆహారం ఎక్కువగా తింటారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో అధికంగా బరువు కూడా పెరుగుతారట. అందుకని నెమ్మదిగా భోజనం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు.
-వేగంగా భోజనం చేయడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో క్రమంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా అజీర్ణ సమస్య వస్తుంది.
-వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్-2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
-చాలా త్వరగా ఆహారం తినడం ముగించేస్తే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వస్తాయి. కనుక ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలని వైద్యులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
- కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతి
- శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 20 వేలు
- రేపు ఉద్యోగులతో త్రిసభ్య కమిటీ భేటీ?