సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Jul 17, 2020 , 18:15:04

డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌కుండానే.. చెవిలో గులిమి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు!

డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌కుండానే.. చెవిలో గులిమి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు!

క‌రోనా టైంలో హాస్పిట‌ల్‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. మ‌నిషి బ‌య‌ట‌కు ఆరోగ్యంగానే క‌నిపించినా శ‌రీరంలో చాలా మార్పులు జ‌రుగుతుంటాయి. ప్ర‌తి చిన్న విష‌యానికి వైద్యుడిని సంప్ర‌దించ‌డం కుద‌ర‌ని ప‌ని. అలా అని ట్రీట్‌మెంట్ తెలియ‌క షాపుల్లో ఇచ్చే టాబ్లెట్లు వాడితే ఉన్న ఆరోగ్యం కాస్త చెడిపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందుక‌నే ఎక్క‌డికి వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవ‌చ్చు. ఎలా అనుకుంటున్నారా? మీ చెవిలో ఉండే గులిమితోనే.. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.

శ‌రీరం అనారోగ్యానికి గురైన‌ప్పుడు చెవిలోని గులిమి కొన్ని సంకేతాలు ఇస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

* చెవులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఎప్ప‌టిక‌ప్పుడు గులిమి తీసేస్తున్న‌ప్ప‌టికీ విప‌రీతంగా పెరుగుతుంటే అనారోగ్యానికి గురైన‌ట్లు భావించాలి.

* ఎప్పుడూ ఉండే రంగు కాకుండా కాస్త గులిమి రంగు మారినా అనారోగ్యానికి గురైన‌ట్లే.

* కాలుష్యం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశంలో నివశించేవారి గులిమి కొంచెం బూడిద రంగులో ఉంటుంది. కాబ‌ట్టి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

* కొంత‌మంది చేతితో, ప‌క్క‌పిన్లు, సేఫ్టీపిన్నుల‌తో గులిమి తీసేట‌ప్పుడు ర‌క్తంగ‌నుక వ‌స్తున్న‌ట్ల‌యితే.. క‌ర్ణ‌భేరిలో ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయ‌ని తెలుసుకోవాలి.

* క‌ర్ణ‌భేరిలో ప‌గుళ్లు ఎక్కువ‌గా ఉంటే ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌వుతారు. ఇది రాను రాను వినికిడి శ‌క్తిని కోల్పోయేలా చేస్తుంది. కాబ‌ట్టి వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది.

* ఒక‌వేళ గులిమి గోధుమ‌రంగులో ఉంటే ఎక్కువ‌గా ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని అర్థం. కాబ‌ట్టి స్ట్రెస్‌కు గుర‌వ‌కుండా ప్ర‌శాంతంగా ఉండండి.

* ఒక్కోసారి గులిమి బాగా న‌ల్ల‌గా మారిపోయి ఉంటుంతి. ఇలా ఉంటే దుమ్ము అనుకుంటారు. అది వాస్త‌వం కాదు. ఇలా ఉన్న‌ప్పుడు ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్‌గా భావించాలి.

* మ‌రి గులిమి న‌ల్ల‌గా మారింద‌ని ఎలా తెలుస్తుంది అంటే.. ఆ స‌మ‌యంలో చెవిలో దుర‌ద ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితిల్లో ఇంటి చిట్కాలు పాటించ‌డ‌కుండా వైద్యుడిని సంప్ర‌దించాలి.

* అలాగే గులిమి క‌నుక తెలుపు రంగులో ఉంటే శ‌రీరంలో విట‌మిన్ల లోపం ఉన్న‌ట్లు గుర్తించాలి. ఆ విట‌మిన్లు ఏంటంటే.. ఐర‌న్‌, కాప‌ర్ లోపం ఉన్న‌వారిలో మాత్ర‌మే ఇలాంటి గుణాలు క‌నిపిస్తాయి. 

చూశారుగా గులిమి ఎన్ని ర‌కాలుగా మారుతుందో. ఒక్కో సంకేతానికి ఒక్కో కార‌ణం ఉంటుంది. కాబ‌ట్టి కాస్త ఆరోగ్యం బాగులేకుంటే గులిమిని చెక్ చేసుకొని కారణం తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.


logo