ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Jun 27, 2020 , 18:30:41

బేకింగ్ సోడాతో ఇలా చేస్తే.. ఈ స‌మ‌స్య‌లు ప‌రార్‌!

బేకింగ్ సోడాతో ఇలా చేస్తే.. ఈ స‌మ‌స్య‌లు ప‌రార్‌!

బేకింగ్ సోడాను వంట‌ల్లో విరివిగా వాడుతుంటారు. ఇది వేయ‌డం వ‌ల్ల రెసిపీకి మంచి టేస్ట్ రావ‌డంతో పాటు మంచి ఆకారం కూడా వ‌స్తుంది. అంద‌రికీ తెలియని మ‌రొక విష‌యం ఏంటేంటే.. బేకింగ్ సోడాతో ఫేస్‌ప్యాక్‌లు వేసుకోవ‌చ్చు అలాగే, గుండె స‌మ‌స్య‌ల‌ను సైతం అరిక‌ట్ట‌వ‌చ్చు. అవేంటో చూసేద్దాం.

అందం : 

* వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి 30 నిమిషాల త‌ర్వాత నీటితో స్నానం చేస్తే పాత చ‌ర్మ‌క‌ణాలు పోయి, కొత్త‌వి వ‌స్తాయి. అంతేకాకుండా శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది..

* ఎండ‌కు కొన్నిసార్లు చ‌ర్మం ఎర్ర‌గా కందిపోతుంది. అలాంట‌ప్పుడు చిన్న క‌ప్పులో బేకింగ్ సోడా వేసి నీటితో క‌లిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి రాసుకొని ఆరిన త‌ర్వాత స్క్ర‌బ్ చేస్తూ నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. ఇలా చేస్తే చ‌ర్మం మెరుస్తుంది.

గుండె ప‌దిలం :

* పావు గ్లాసు నీటిలో, ఒక టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే.. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు తొలిగిపోతాయి అంటున్నారు నిపుణులు. 

* దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే  ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుంది. మంచిది క‌దా అని ఎక్కువ‌గా తాగితే మొత్తానికే మోసం. 

* కొంమంది కాలి మ‌డ‌మ‌లు బాగా ప‌గ‌ల‌డంతో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. గోరువెచ్చ‌ని నీటిలో బేకింగ్ సోడా క‌ల‌పాలి. ఆ నీటిలో 30 నిమిషాల పాటు కాళ్ల‌ని ఉంచాలి. ఆ త‌ర్వాత శుభ్ర‌ప‌రుచుకుంటే స‌రిపోతుంది. ఈ బాధ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. logo