గురువారం 01 అక్టోబర్ 2020
Health - Sep 17, 2020 , 13:48:46

నిద్ర‌లో దంతాలు కొరుకుతున్నారా? అయితే ఈ స‌మ‌స్య‌లున్న‌ట్లే!

నిద్ర‌లో దంతాలు కొరుకుతున్నారా? అయితే ఈ స‌మ‌స్య‌లున్న‌ట్లే!

చాలామంది నిద్ర‌పోయేట‌ప్పుడు ప‌ళ్లు కొరుకుతుంటారు. దీనిని బ్ర‌క్సిజం అని పిలుస్తారు. ఇదొక వైద్య ప‌దం. నిద్ర‌పోయేట‌ప్పుడు బ్ర‌క్సిజం ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. కొంత‌మంది మేల్కొని ఉన్న‌ప్పుడు కూడా ఇలా చేస్తుంటారు. ఇదేం వ్యాధి కాదు. కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా నిద్ర‌లో ప‌ళ్లు కొరుకుతారు. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏంటో తెలుసుకోండి. 

ఆందోళన : ఒత్తిడి, ఆందోళనను గురైన‌ప్పుడు వాళ్లు నిద్ర‌పోయేట‌ప్పుడు ఆ విష‌యాలు త‌లుచుకుంటూ ఉంటారు. ఆ స‌మ‌యంలోనే ప‌ళ్లు కొరుకుతారు. 

మందులు :  యాంటిడిప్రెసెంట్స్ (ప్రిస్క్రిప్ష‌న్ మెడిసిన్స్‌) మందులు వాడే వారిలో ఈ ల‌క్ష‌ణం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. 

నిద్ర రుగ్మతలు :  చాలామంది నిద్ర‌పోయేట‌ప్పుడు గుర‌క పెడుతుంటారు. ఇది వ‌ర‌కు పెద్ద‌వాళ్లు మాత్ర‌మే పెడుతున్నారు. ఇప్పుడు చిన్న‌పిల్ల‌లు కూడా పెడుతున్నారు. జ‌లుబు, ద‌గ్గు కార‌ణంగా నోరు తెరిచి ప‌డుకుంటారు. దీనివ‌ల్ల కూడా గుర‌క‌వ‌స్తుంది. అలా గుర‌క పెట్టేట‌ప్పుడు కూడా ప‌ళ్ల కొర‌క‌డానికి ఎక్కువ అవ‌కాశం ఉందంటున్నారు నిపుణులు.  

స్లీప్ పక్షవాతం :  స్లీప్ పెరాల‌సిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కూడా దంతాలు కొరుకుతుంటారు. ఇది నిద్ర‌పోతున్న‌ప్పుడు లేదంటే మేల్కొనేట‌ప్పుడు టెంపొర‌రీ ఇమ్మోబిలిటీ(తాత్కాలిక క‌ద‌లిక‌)కు దారితీస్తుంది. 

ధూమపానం, మద్యపానం :  నిద్ర‌పోయేట‌ప్పుడు ప‌ళ్లు కొర‌క‌డానికి ధూమ‌పానం, మ‌ద్య‌పానం కూడా ఒక కార‌ణం. 

కెఫిన్ :  టీ, కాఫీ వంటి కెఫిన్ వంటి పానీయాలు కూడా బ్ర‌క్సిజం వ‌చ్చేందుకు దారితీస్తారు. ప‌ళ్లు కొరికే స‌మ‌స్య నిద్ర‌లో వ‌స్తుంది కాబట్టి, ఇది బ‌ట‌య ప‌డేంత వ‌ర‌కు గుర్తించ‌లేం.


logo