బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 27, 2020 , 16:23:54

గ్యాస్‌ట్ర‌బుల్ ఎందుకు వ‌స్తుందో తెలుసా? కార‌ణాలివే!

గ్యాస్‌ట్ర‌బుల్ ఎందుకు వ‌స్తుందో తెలుసా?  కార‌ణాలివే!

ఇప్పుడు మ‌నుషులు ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్ప‌డానికే లేదు. ఎవ‌రిని క‌దిలించినా ఏదొక స‌మ‌స్య‌. వ‌య‌సులో ఉన్న‌వారిని క‌దిలిస్తే అంతా బాగానే ఉంది కాని గ్యాస్‌ట్ర‌బుల్ వ‌చ్చింది అంటున్నారు. అస‌లు గ్యాస్ బ్ర‌టుల్ ఎందుకు వ‌స్తుంది? దానికి కార‌ణం ఏంటి? వ‌స్తే దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి అనే విష‌యాల గురించి తెలుసుకుందాం. 

కార‌ణం : 

* సాధార‌ణంగా గ్యాస్ ట్ర‌బుల్ పెద్ద‌వారికి సంక్ర‌మించే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. 

* రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌ల‌హీన ప‌డ‌టం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య‌కు దారితీస్తుంది.

* సీసం, ఆర్సెనిక్‌, పాద‌ర‌సం వంటి భారీ లోహాల‌తో క‌లుషిత‌మ‌మైన నీటిని తాగ‌డం వ‌ల్ల కూడా గ్యాస్ ట్ర‌బుల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

* అసిడిక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది.

* క‌లుషిత‌మైన సీఫుడ్ తిన‌డం వ‌ల్ల కూడా ప్ర‌మాదానికి తీస్తుంది.

* యాంటాసిడ్లు, కెమోథెర‌పీ మందులు, యాంటీబ‌యాటిక్స్‌, విరేచినాలు వంటి మందులు వాడ‌కం.

* ఒక‌వేళ గ్యాస్‌ట్ర‌బుల్ స‌మ‌స్య ఉన్న‌ట్ల‌యితే కింది సంకేతాలు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

ల‌క్ష‌ణాలు :

* నీటి విరేచనాలు

* వాంతులు

* కడుపు నొప్పి

* జ్వరం

* వికారం

* తిమ్మిరి

* తలనొప్పి

* నిర్జలీకరణం

* పొడి చర్మం

* తలనొప్పి

* దాహం

ఈ స‌మ‌స్య చిన్న‌పిల్ల‌ల్లో ఉన్న‌ట్ల‌యితే టాయిలెట్‌కు త‌క్కువ‌గా వెళ్తుంటారు. ఎక్కువ‌గా దాహం, నోరు ఎండిపోవ‌డం, చ‌ర్మం పొడిబార‌డం, క‌డుపు ఫ్లూ వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాల ద్వారా గ్యాస్‌ట్ర‌బుల్ ఉంద‌ని నిర్థారించినట్లియితే వెంట‌నే డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.


logo