మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Aug 28, 2020 , 13:20:43

పీల్చే గాలి కాలుష్య‌మైందా.. అయితే వ‌చ్చే స‌మ‌స్యలివే..!

పీల్చే గాలి కాలుష్య‌మైందా.. అయితే వ‌చ్చే స‌మ‌స్యలివే..!

వాతావర‌ణం అనుకూలంగా ఉంటే ఎలాంటి రోగాలు ద‌రిచేర‌వు. ఈ రోజుల్లో చిన్న‌పిల్ల‌లు నుంచి పెద్ద‌ల‌ వ‌ర‌కు వ‌య‌సుతో సంబంధం లేకుండా వ‌చ్చే స‌మ‌స్య‌లకు కార‌ణం వాతావ‌ర‌ణం కాలుష్యమే. దీనివ‌ల్ల మ‌నం పీల్చే గాలి కూడా కాలుష్యం అవుతుంది. మ‌రి తింటున్న తిండితోనే కాకుండా పీల్చే గాలి కూడా కాలుష్యంగా మారితే ఎన్నిరోజుల‌ని బ‌తుకుతాం. ఒక్కోసారి హాస్పిట‌ల్‌లో బిల్లు చెల్లించేందుకే రోజంతా క‌ష్ట‌ప‌డి సంపాదిస్తున్న‌ట్లు అనిపిస్తుంది. అస‌లు గాలి కాలుష్యం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటే కాస్త అయినా జాగ్ర‌త్త‌గా ఉంటారు. మ‌రి అవేంటో తెలుసుకోండి.

* కాలుష్య‌మైన‌ గాలిని పీల్చ‌డం వ‌ల్ల ఆస్థ్మా ఎటాక్స్ ఎక్కువ అవుతాయి. వీటిని ఆపడం అంత సులువు కాదు.

* హార్ట్ ఎటాక్‌, స్ట్రోక్ వంటి రోగాల‌కు కార‌ణం గాలి కాలుష్య‌మే. ఇలాంటి వాళ్లు ఎక్కువ‌గా కారులో ప్ర‌యాణించ‌డం మంచిది.

* చిన్న‌పిల్ల‌ల‌ను అనారోగ్యానికి దారితీస్తుంది. వారి లంగ్స్ డెవ‌ల‌ప్ అవ్వ‌కుండా చేస్తుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్ష‌న్స్‌కు దారితీస్తుంది.

* గాలి కాలుష్యం వ‌ల్ల లంగ్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

* ఎంత ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికీ గాలి కాలుష్యం వ‌ల్ల ద‌గ్గు, ఆయాసం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

* దీనివ‌ల్ల పిల్ల‌ల పెరుగుద‌ల‌కు ఆట‌కం క‌లుగుతుంది. పుట్టే పిల్ల‌లు త‌క్కువ బ‌రువుతో పుడ‌తారు. వీరికి ఇంఫంట్ మోర్టాలిటీ ఎక్కువ‌గా ఉంటుంది.

* దీనివ‌ల్ల మ‌నిషి జీవిత‌కాలం కూడా త‌గ్గిపోతుంది.

* క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్న వారికి పొల్యూషన్ తో నిండిన గాలి పీల్చడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమౌతుంది. 

* రీసెంట్ గా జరిగిన ఒక సర్వే లో గాలి కాలుష్యం వల్ల డయాబెటీస్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి వ్యాధుల బారిన పడే ముప్పు పెరుగుతుందని తెలిసింది.


logo