మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Sep 10, 2020 , 19:27:41

ఈ వ‌య‌సు వాళ్లు ఎక్కువ‌గా వ‌క్క‌పొడిని న‌ములుతున్నారా? అయి‌తే జాగ్ర‌త్త‌!

ఈ వ‌య‌సు వాళ్లు ఎక్కువ‌గా వ‌క్క‌పొడిని న‌ములుతున్నారా? అయి‌తే జాగ్ర‌త్త‌!

సాధార‌ణంగా త‌మ‌ల‌పాకు న‌మిలితే ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ అదే ప‌నిగా వ‌క్క‌తోపాటు క‌లిపి న‌ములుతుంటే అది ఆరోగ్యానికి హానిక‌రంగా మార‌తుంది. అంతేకాదు ఇది మ‌త్తుమందుతో స‌మానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌న పూర్వీకుల‌కు ఆకు, వ‌క్క‌, సున్నం మూడింటినీ క‌లిపి వేసుకునే అల‌వాటు ఎక్కువ‌గా ఉండేది. ఇది న‌ములుతూ ఉండ‌డం వ‌ల్ల వారికి ఆక‌లి కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే వాటికి ఇప్ప‌టి త‌రం కొంత‌వ‌ర‌కు దూరంగా ఉన్నా వాటి రూపంలో ఉండే వ‌క్క‌పొడిని మాత్రం విప‌రీతంగా న‌ములుతున్నారు. శుభ‌కార్యాలు, వేడుక‌లు అలా ఎప్పుడైనా తింటే మ‌రేం ప‌ర్వాలేదు. రెగుల‌ర్‌గా తిన‌డం మానేయాలి.

ముఖ్యంగా బాలింత‌లు, గ‌ర్భిణిలు వ‌క్క‌పొడిని అస‌లు న‌మ‌ల‌కూడ‌దు. వ‌క్క‌పొడి వ‌ల్ల త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రికీ మంచిది కాదు. అంతేకాదు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సులోపు వారు వ‌క్క‌పొడి తిన‌డం వ‌ల్ల వారి ర‌క్తంపై ప్ర‌భావం చూపుతుంది. వ‌క్క‌ల‌లో టానిన్ల శాతం, ఆల్క‌లాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేయ‌డ‌మే కాకుండా క్యాన్స‌ర్ బారిన ప‌డేలా చేస్తుంది. అన్నింటికీ మించి మ‌తిమ‌రుపు ఒక‌టి ప‌రిచ‌యం అవుతుంది. ఇన్ని స‌మ‌స్య‌లు తీసుకొచ్చే వ‌క్క‌పొడిని తిన‌డం మానేస్తే స‌రిపోతుంది క‌దా..!


logo