మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Apr 06, 2020 , 19:47:49

కాళ్ళ‌కి న‌ల్ల‌దారం.. ఎందుకు క‌డ‌తారు?

కాళ్ళ‌కి న‌ల్ల‌దారం.. ఎందుకు క‌డ‌తారు?

భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు..  హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే.. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నుదురు, బుగ్గపైన కాటుక బొట్టు పెడ‌తారు. అదేవిధంగా బయటికి వెళ్లినప్పుడు దిష్టి తగలకుండా ఉండేందుకు  పాదానికి కూడా బొట్టు పెడ‌తారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రతికూల శక్తిని న‌లుపురంగు దూరం చేస్తుందనే ఒక నమ్మకంతో ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇదే చారం పిల్లలకు వయసు పెరిగే కొద్ది దాని రూపం కూడా మారుతుంది. కొంచెం పెద్ద‌య్యాక బొట్లుకు దూర‌మ‌వుతారు. దాంతో న‌లుపురంగు తాడును కాలికి కట్టుకుంటారు. 


logo