మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Sep 06, 2020 , 16:44:39

బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి! ‌

బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి! ‌

హైదరాబాద్: కలోంజి సీడ్స్‌ను బ్లాక్ సీడ్స్ లేదా బ్లాక్ క్యుమిన్ సీడ్స్ అంటారు. తెలుగులో నల్ల జీలకర్రగా పిలుస్తారు. వేల సంవత్సరాల నుంచి వీటిని సాంప్రదాయ, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. వీటి గురించి చాల మందికి తెలియదు కానీ జుట్టు దగ్గర నుంచి పాదాల వరకు దాదాపుగా మన శరీరంలోని అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి మెడిసిన్. ఇందులో  విటమిన్ బీ1, బీ2, బీ3లతో పాటు కాల్షియం, ఫోలిక్ ఆసిడ్, ఐరన్, కాపర్, జింక్, పాస్ఫరస్‌లాంటి పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కాగా, దీనికి అధిక బరువును తగ్గించే గొప్ప గుణముందని ఆయుర్వేదం చెబుతోంది. 

అధిక బరువును ఎలా తగ్గిస్తుంది..?

కలోంజీ వివిధ రకాల సూక్ష్మపోషకాలతో నిండి ఉంది. ఇది మందులను తయారు చేయడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా. ఆయుర్వేదంలోనే కాదు, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలలో కూడా ఈ నల్ల విత్తనాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఫైటోకెమికల్స్ అని పిలువబడే క్రియాశీల సమ్మేళనాలు కూడా ఉంటాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్ ఉన్నాయి. ఇవి బరువును తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. 

ఆకలిని నియంత్రించి, కొవ్వును తగ్గించేందుకు కారణమైన నిర్దిష్ట జన్యువుల వ్యక్తీకరణను మార్చడం ద్వారా క్రియాశీల ఫైటోకెమికల్ బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని సైన్స్ సూచిస్తున్నది. ఇది కాకుండా, డయాబెటిస్, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో కూడా కలోంజీ ఉపయోగపడుతుంది. ఈ చిన్న విత్తనాలను తీసుకునేందుకు ఇక్కడ మూడు పద్ధతులున్నాయి.

విధానం 1: తేనె, నిమ్మకాయతో..

ఒక చిటికెడు కలోంజి విత్తనాలను (5-10) తీసుకొని వాటిని మెత్తగా చూర్ణం చేసుకోండి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలోంజీ పౌడర్ వేసి బాగా కలపాలి. దీనికి ఒక చెంచా తేనె వేసి సగం నిమ్మకాయ రసం పిండాలి. ప్రతిదీ చక్కగా కలపండి. ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

విధానం 2: నిమ్మరసంతో..

ఒక గిన్నెలో 8-10 కలోంజి విత్తనాలను తీసుకొని అందులో సగం నిమ్మరసం పిండాలి. ఇప్పుడు ఈ కలోంజిని 1-2 రోజులు ఎండలో ఉంచండి. బరువు తగ్గడానికి రోజుకు రెండుసార్లు 2-4 కలోంజి గింజలను తీసుకోండి.

విధానం 3: నీటితో నేరుగా తీసుకోండి..

కొన్ని కలోంజి విత్తనాలను తీసుకొని గోరువెచ్చని నీటితో కలిపి మింగాలి. లేదా 8-10 విత్తనాల కలోంజిని ఒక గ్లాసులో వేసి రాత్రిపూట నానబెట్టాలి. విత్తనాలను తొలగించి ఉదయం కలోంజి నీళ్లు తాగాలి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo