శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 27, 2020 , 18:34:09

కరోనా మహమ్మారి 'అలసట'తో జాగ్రత్త!

కరోనా మహమ్మారి 'అలసట'తో జాగ్రత్త!

గత కొన్ని నెలలుగా మనమంతా ఇంటికే పరిమితమయ్యాం. దాదాపు ఏడాది కాలం మసకబారింది. పండగలు, పర్వదినాలు, ఉత్సవాలు గంభీరమైన రీతిలో జరుగుతున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి మన జీవన విధానాన్నే మార్చేసింది. కరోనా కారణంగా పాటించాల్సిన విధానాలతో ‘మహమ్మారి అలసట’కు గురై మనం ఇబ్బందుల పాలవుతున్నాం. సాధారణ అలసట మాదిరిగానే, మహమ్మారి అలసట కూడా.. మనల్ని శారీరకంగా, మానసికంగా ఇక్కట్లకు గురిచేస్తుంది. ఈ మహమ్మారి మరో ఏడాది కూడా మనల్ని బెదిరించాలని చూస్తున్నందున.. ఇకా మనకు విశ్రాంతి దొరుకదు.. మానసిక ఆనందం లభించడమూ కష్టంగానే మారనున్నదని నిపుణులు చెప్తున్నారు.

మహమ్మారి అలసట అనేది ఉదాసీనత, చంచలతకు దారితీస్తుందని ములుండ్ ఫోర్టిస్ హాస్పిటల్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ అనితా మాథ్యూ చెప్పారు. లాక్‌డౌన్ పరిమితులు ఎత్తివేస్తున్నందున ఇది ప్రత్యేకంగా వర్తిస్తుందని పేర్కొన్నారు. మహమ్మారి-ప్రేరేపిత అలసట ప్రజలను సంక్రమణ పట్ల ఉదాసీనతను ప్రదర్శించేలా చేస్తుందని, కొవిడ్‌-19 వ్యాప్తిని తేలికగా తీసుకోలేమని ఆమె హెచ్చరిస్తున్నారు.  ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్‌నెస్ (ఏసీడీపీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ వివిధ ఉపరితలాలపై ఆచరణీయంగా ఉండి.. తద్వారా వ్యాప్తి చెందుతుందని డాక్టర్ అనితా మాథ్యూ వివరించారు. “20 డిగ్రీల సెల్సియస్ వద్ద సార్స్‌-కొవ్‌-2.. గాజు, ఉక్కు, కరెన్సీ నోట్లు, మొబైల్ ఫోన్లు, ఎలివేటర్ బటన్లపై 28 రోజులపాటు ఉంటుందని గుర్తించారు. 30 డిగ్రీల సెల్సియస్ వద్ద మనుగడ రేటు ఏడు రోజులకు పడిపోగా.. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కేవలం 24 గంటలకు పడిపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

మహమ్మారి అలసట-ప్రేరేపిత ఉదాసీనతతో ప్రజలు వారి భద్రత, రక్షణపై శ్రద్ధ చూపడం మానేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివాటిని వీలైనంతవరకు నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే వీలుంటుందని నిపుణులు సెలవిస్తున్నారు. మనం నిత్యం అవసరాల్లో ఎక్కువగా వినియోగించే ఉపరితలాలను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా సంక్రమణకు గురైన వ్యక్తులకు వీలైనంత ఎక్కువ దూరంలో ఉండటం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.

మనం ఎక్కువగా ఉపయోగించే ఉపరితలాలు

* తలుపులు, తలుపు గుబ్బలు

* టేబుల్ టాప్స్, కుర్చీ బ్యాక్

* స్విచ్‌ బోర్డులు

* మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు

* రిమోట్లు, కన్సోల్‌లు

* నల్లాలు, ఫ్లష్‌లు

* ఎలివేటర్ బటన్లు

* మెట్ల రైలింగ్‌లు

* షాపింగ్ కార్డులు

* ఏటీఎం బటన్లు

వీటిని నేరుగా తాకకుండా చూసుకోవాలి. బయటి వ్యక్తులను ఇంట్లోకి రానీయకుండా, మనం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖాలకు మాస్కులు ధరించడం, చేతులను శానిటైజ్‌ చేసుకోవడం మరిచిపోవద్దు. అలాగే బయటి నుంచి ఇంటికి రాగానే చేతులను శుభ్రం చేసుకోవాలి. మనం నిత్యం వాడే గాడ్జెట్స్‌ను కూడా శానిటైజ్‌ చేయడం మరిచిపోవద్దు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.