ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Aug 26, 2020 , 19:37:58

'విట‌మిన్ డి' ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది!

'విట‌మిన్ డి' ఎక్కువైనా ప్ర‌మాద‌మే.. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది!

ఇప్ప‌టివ‌ర‌కు విట‌మిన్ డి శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఉద‌యాన్నే వ‌చ్చే సూర్య‌ర‌శ్మి నుంచి విటమిన్ డి పొంద‌డం శ్రేయ‌స్క‌రం అనే తెలుసు. కానీ మ‌న‌కు తెలియ‌నివి చాలా ఉన్నాయి. శ‌రీరంలో విట‌మిన్ డి త‌క్కువైతే ఎన్ని రోగాల‌కు దారితీస్తుందో ఎక్కువైనా అంతే ప్ర‌మాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రి విట‌మిన్ డి ఎక్కువ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుదో తెలుసుకుందాం.  

హైప‌ర్‌కాల్సేమియా :

శ‌రీరంలో విట‌మిన్ డి అధిక స్థాయిలో ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాల్షియం అనుచితంగా ఉంటుంది. ఎక్కువ క్యాల్షియం క‌లిగి ఉండ‌డం వ‌ల్ల ఆక‌లి త‌గ్గ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, వికారం, అధిక ర‌క్త‌పోటు వంటి మ‌రిన్ని దుష్ప్ర‌భావాలు ఏర్ప‌డుతాయి.  

మూత్రపిండాలకు హానికరం : 

విటమిన్ డి ఎక్కువగా మూత్రపిండాల వ్యాధుల‌ను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు ముందుగా వైద్యుడిని సంప్ర‌దించిన త‌ర్వాతే డైట్ విష‌యంలో విటమిన్ డి స‌ప్లిమెంట్ల‌ను చేర్చుకోవాలి. 

జీర్ణ సమస్యలు :

శరీరంలో విటమిన్ డి, కాల్షియం ఎక్కువైతే కడుపునొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటి అనేక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇవి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతాలు కావచ్చు.

ఎముక‌లు బ‌ల‌హీన‌ప‌డ‌టం :

విట‌మిన్ డి పుష్క‌లంగా ఉంటే ఎముక‌లు దృఢంగా ఉంటాయ‌ని తెలిసిందే. కానీ విట‌మిన్ డి ఎక్కువైతే ఎముక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. కాబ‌ట్టి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డానికి క్యాల్షియం, విట‌మిన్ డిని త‌గిన ప‌రిమాణంలో తీసుకోవాలి. 

వికారం, వాంతులు : 

శరీరంలో అధికంగా కాల్షియం ఉండ‌డం వ‌ల్ల వికారం, వాంతులు, ఆకలి వేయ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కాబ‌ట్టి ప్ర‌తిరోజూ ఎంత ప‌రిమాణంలో విట‌మిన్ డి ఆహారం తీసుకోవాలో వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. 


logo