విట‌మిన్ ఎ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే..?


Sat,February 9, 2019 03:47 PM

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోష‌కాల్లో విట‌మిన్ ఎ కూడా ఒక‌టి. ఇది శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. విట‌మిన్ ఎ కొవ్వులో క‌రుగుతుంది. విట‌మిన్ ఎ మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు దృఢంగా ఉండాల‌న్నా, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు, ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాల‌న్నా, కంటి చూపుకు, గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌ల‌కు, శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు.. ఇలా అనేక ర‌కాల ప‌నుల‌కు విట‌మిన్ ఎ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే విట‌మిన్ ఎ మ‌న‌కు ఏయే ప‌దార్థాల్లో ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కంద‌గ‌డ్డ‌ల‌లో విటిమ‌న్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు ఫైబ‌ర్ కూడా వీటిలో ఎక్కువ‌గానే ఉంటుంది. వీటిల్లో ఉండే ఔష‌ధ గుణాలు డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

2. డ్రై యాప్రికాట్ల‌లోనూ విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మానికి మేలు చేస్తుంది.

3. కోడిగుడ్డు ప‌చ్చ సొన‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భిస్తుంది. నిత్యం కోడిగుడ్ల‌ను తిన‌డం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. అలాగే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. శ‌రీరం క‌ణ‌జాలానికి మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్ల‌ను తీసుకుంటే మంచిది.

4. విట‌మిన్ ఎ అధికంగా ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. నిత్యం క్యారెట్ల‌ను తిన‌డం ద్వారా కంటి చూపును మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది.

5. ఆకుప‌చ్చ ప‌సుపు, ఎరుపు రంగులో ఉండే ఏ క్యాప్సికంలోనైనా స‌రే విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. కంటి చూపు పెరుగుతుంది. నిత్యం క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ముందు చెప్పిన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

4383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles