ఆదివారం 07 జూన్ 2020
Health - Mar 29, 2020 , 11:21:08

కూర‌గాయ‌ల‌తో ఆస్తమాకు చెక్‌..!

కూర‌గాయ‌ల‌తో ఆస్తమాకు చెక్‌..!

అమెరికా: పాల ఉత్ప‌త్తులు, అధిక కొవ్వు గ‌ల ప‌దార్థాలు ఆస్త‌మా (శ్వాస సంబంధ స‌మ‌స్య‌) ను పెంచితే.., మొక్క‌ల సంబంధిత ఉత్ప‌త్తులు (ఆకుకూర‌లు, కూర‌గాయలు) మాత్రం ఆస్త‌మా స‌మ‌స్య‌ కు చెక్ పెడ‌తాయ‌ట‌. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య అయిన ఆస్త‌మాలో  శ్వాస‌నాళాలు వాచి..ద‌గ్గులు, శ్వాస‌కు ఆటంకం ఏర్ప‌డ‌టం, గుర‌క వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. సుమారు 25 మిలియ‌న్ల మంది అమెరిక‌న్ల కు ఆస్త‌మా స‌మ‌స్య ఉంది.దురదృష్ట‌వ‌శాత్తు క‌రోనా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో..ఆస్త‌మా రోగుల‌కు వైర‌స్ మ‌రింత హాని క‌లిగించే అవ‌కాశం ఉంది. ఆహార‌పు అల‌వాట్ల‌లొ మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి దూరంగా ఉండ‌వచ్చని డైరెక్ట‌ర్ ఆఫ్ క్లినిక‌ల్ రీసెర్చ్ (ఎండీ, పీహెచ్‌డీ) అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన ర‌చ‌యిత హ‌నా కాలియోవో తెలిపారు. 

ఆస్తామా రోగుల‌ను మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ చేసిన త‌ర్వాత..కూర‌గాయ‌లు, తృణ‌ధాన్యాలు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉన్న ఆహార‌దార్థాలు తీసుకునే వారు....పాల ప‌దార్థాలు, అధిక కొవ్వున్న ప‌దార్థాలు తీసుకున్న వారి క‌న్నా ఆరోగ్య‌వంతంగా ఉన్న‌ట్లు రీసెర్చ్ బృందంలోని ఫిజీషియ‌న్స్ క‌మిటీ అంచ‌నాకు వ‌చ్చినట్లు ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్ర‌చురించే న్యూట్రిష‌న్ రివ్యూస్ క‌థ‌నం లో వెల్ల‌డించింది.logo