గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 16, 2020 , 21:14:22

క్షయ వ్యాధికి కొత్త వ్యాక్సిన్‌ ?!

క్షయ వ్యాధికి కొత్త వ్యాక్సిన్‌ ?!

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు క్షయ వ్యాధి కూడా ప్రధాన కారణంగా ఉంటోంది. పిల్లల్లో టీబీకి నిరోధక శక్తి కోసం ఇప్పటివరకు బిసిజి వ్యాక్సిన్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే ఇది కేవలం 50 శాతం మాత్రమే సమర్థతను చూపుతోంది. ఇది పూర్తి స్థాయిలో పనిచేయకుండా అడ్డుకుంటున్న బయోమార్కర్‌ను ఇటీవలే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. టీబీపై పనిచేసే యాంటీబాడీలైన ఎజి85ఎ అనే ప్రొటీన్‌ను కూడా కనుక్కున్నారు. ఈ ప్రొటీన్‌ ఎంత ఎక్కువగా ఉంటే టీబీ రిస్కు అంత తక్కువగా ఉంటుందన్నమాట. ఈ పరిశోధన సమర్థవంతమైన టీబీ వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి మార్గం సుగమం చేస్తుందని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నమని చెబుతున్నారు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు.logo