శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Aug 15, 2020 , 16:24:16

త‌మ‌ల‌పాకుతో చేసిన కిళ్లీ న‌ములుతున్నారా? వారికో శుభ‌వార్త‌!

త‌మ‌ల‌పాకుతో చేసిన కిళ్లీ న‌ములుతున్నారా?  వారికో శుభ‌వార్త‌!

త‌మ‌ల‌పాకుల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త మ‌రే ఆకుకు ఉండ‌దు. దేవుడికి సైతం త‌మ‌ల‌పాకుల‌నే స‌మ‌ర్పిస్తారు. త‌మ‌ల‌పాకుల‌ను ఇత‌రుల‌కు అందిస్తే శుభం జ‌రుగుతుంద‌ని భార‌తీయుల న‌మ్మ‌కం. ఇలా పండుగ‌ల‌కే కాకుండా త‌మ‌ల‌పాకుల‌ను కిళ్లీలుగా కూడా వేసుకుంటూ ఉంటారు. దీనికి అల‌వాటు ప‌డిన వారు రోజుకు రెండు, మూడు న‌మ‌లందే ఉండ‌లేరు. తాంబూలంతో ఆరోగ్య‌మే కాని ఎలాంటి చెడు ద‌రిచేర‌దు. త‌మ‌ల‌పాకు వ‌ల్ల క‌లిగే మ‌రికొన్ని ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకోండి. 

ప్ర‌యోజ‌నాలు :

* త‌మ‌ల‌పాకును తాంబూలం అని కూడా అంటారు. ఇందులో క్యాల్షియం, ఫైబ‌ర్‌, పోలిక్ యాసిడ్‌, విట‌మిన్ ఎ, సిలు పుష్క‌లంగా ఉంటాయి. 

* త‌మ‌ల‌పాకులు న‌మ‌ల‌డం వ‌లన రోగ నిరోధ‌క శ‌క్తి  పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మేలు చేస్తుంది.

* త‌ల‌నొప్పితో బాధ‌ప‌డేవారు త‌మ‌ల‌పాకుల‌ను నూరి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని ముక్కు‌లో వేస్తే త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* ఈ రోజుల్లో అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు చాలామందే ఉన్నారు. వారు రెండు నెల‌ల‌పాటు ప్ర‌తిరోజూ ఒక త‌మ‌ల‌పాకు, 10 గ్రా. మిరియాలు క‌లిపి తినాలి. త‌ర్వాత వెంట‌నే చ‌న్నీళ్లు తాగితే స‌రిపోతుంది.

* త‌మ‌ల‌పాకులో నూనె ఉంటుంది. ఇది ఫంగ‌స్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది.

* తమ‌ల‌పాకు న‌మిలేవారిలో వృద్దాప్య చాయ‌లు త‌క్కువ‌గా క‌నిపిస్తాయి. ఇది యాంటాక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. 

* రేర్‌గా క‌నిపించే బోధ‌కాలు మ‌నిషిని నాశ‌నం చేస్తుంది. ఈ వ్యాధి నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. రోజూ 7 త‌మ‌ల‌పాకుల‌ను ఉప్పుతో క‌లిపి ముద్ద చేసుకోవాలి. దీన్ని నీటితో తీసుకుంటే మేలు చేస్తుంది.

* త‌మ‌ల‌పాకులు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప‌నిచేస్తుంది. వీటిని ముద్ద‌గా నూరి త‌ల‌కు ప‌ట్టించాలి. గంట త‌ర్వాత త‌ల‌స్నానం  చేస్తే చుండ్రు ర‌మ్మ‌న్నా కూడా రాదు.  

   


logo