మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Aug 24, 2020 , 23:29:19

వాము వాడకం.. ఆరోగ్యానికి ప్రయోజనకరం

వాము వాడకం.. ఆరోగ్యానికి ప్రయోజనకరం

హైదరాబాద్: మన వంటింట్లోనే ఎన్నో ఔషధాలు ఉంటాయి. ప్రతి పదార్థానికి ఓ సుగుణం ఉంటుంది. ఇవి ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కోవకు చెందిందే వాము. దీన్ని మనం ఓమ అని కూడా పిలుస్తాం. దీన్ని రోజూ వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది కఫాన్ని హరిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలను కలిగి ఉంటుంది.  దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే..

  • వాము జీర్ణశక్తిని పెంచుతుంది.
  • తిన్న ఆహారం జీర్ణం కానపుడు వేడినీటిలో వాము వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • దీంతో తయారుచేసిన కషాయం తాగితే జ్వరం తగ్గిపోతుంది.
  • ఇవి వికారాన్ని తగ్గిస్తుంది. 
  • వాంతులు తగ్గడానికి ఉపకరిస్తుంది.
  • చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు లాంటి సమస్యలుంటే వాముని వేయించి కాస్త నలిపి  వాసన చూపించడం వల్లమంచి ఫలితం ఉంటుంది. అందుకే వాముని ఒక గుడ్డలో చిన్న చిన్న ఉండలుగా కట్టి చిన్న పిల్లల మెడలో కడతారు. జలుబు, దగ్గు కి ఇది ఒక మంచి రెమెడి.
  • ప్రతిరోజూ అరటీస్పూన్‌ వాము తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
  • వాములో ఉండే పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌ గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి.
  • ఇందులో విటమిన్‌ ఏ తోపాటు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సీ కూడా ఉంటుంది.

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo