జుట్టు పెర‌గాలంటే.. క‌రివేపాకును ఇలా వాడాలి..!


Thu,December 14, 2017 12:16 PM

క‌రివేపాకును మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా వేస్తాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే చేదు ఉండ‌డం కార‌ణంగా క‌రివేపాకును చాలా మంది తిన‌రు. కానీ దీన్ని తింటే మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే క‌రివేపాకు వ‌ల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డంతోపాటు శిరోజాలను కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అయితే శిరోజాల సంరక్ష‌ణ‌కు క‌రివేపాకును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హెయిర్ టానిక్


తాజా కరివేపాకు ఆకులు, కొబ్బరినూనెలను ఒక గిన్నెలో తీసుకోవాలి. రెండింటినీ కలిపి నలుపు రంగు మిశ్రమం వచ్చే వరకు మరిగించాలి. చల్లబరిచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 1 గంట సేపు ఇలా ఉండాలి. అనంతరం తలస్నానం చేయాలి. వారానికి 2 సార్ల చొప్పున 15 నుంచి నెల రోజుల పాటు ఇది వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనె శిరోజాల సంరక్షణకు, కరివేపాలు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతాయి. ఈ మిశ్రమం జుట్టును త్వరగా తెల్లబడనీయకుండా చేస్తుంది.

2. హెయిర్ మాస్క్


కొద్దిగా కరివేపాకు ఆకులను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని గడ్డ పెరుగుకు కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలా వదిలేయాలి. త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే వెంట్రుకల పెరుగుదలలో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపిస్తుంది. జుట్టును ప్రకాశవంతంగా, స్మూత్‌గా చేయడంలో ఈ మిశ్రమం బాగా ఉపయోగపడుతుంది.

3. కరివేపాకు టీ


నీటిలో కరివేపాకు ఆకులను మరిగించి ఆ రసానికి నిమ్మరసం, చక్కెర కలపాలి. దీన్ని రోజూ వారం పాటు తాగాలి. ఇది శిరోజాల వృద్ధిని పెంచుతుంది. వెంట్రుకలకు మెరుపును తెస్తుంది. జీర్ణక్రియకు కూడా ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది.

10221

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles