గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jun 03, 2020 , 18:30:05

రాగి పాత్రలు వాడండి.. కరోనా రాకుండా చూసుకోండి

 రాగి పాత్రలు వాడండి.. కరోనా రాకుండా చూసుకోండి

ముంబై: నీటిని సహజసిద్ధంగా శుద్ధి చేసే రాగికి.. బ్యాక్టీరియాను తరిమికొట్టే గుణం కూడా ఉన్నదని శాస్త్రవేత్తలు సెలవిచ్చారు. రాగి పాత్రలో నీరు తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి మైక్రో ఆర్గానిజం  దరిచేరదని పరిశోధనలు తేల్చాయి. అంతేకాకుండా రాత్రంతా రాగిపాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయాన్నే తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకెళ్లిపోతాయని కూడా వైద్యనిపుణులు చెప్పారు. అంతటి మహత్తు ఉన్న రాగి పాత్రలను వాడితే కరోనా వైరస్‌ను తరిమికొట్టొచ్చని చెప్తున్నారు నిపుణులు.

కొన్నేండ్ల క్రితం వరకు వంటింట్లో ప్రతీ వస్తువు రాగితో చేసినవే ఉండేవి. రాన్రాను ఫ్యాషన్‌ పెరిగిపోయి రాగి వస్తువులు కనుమరుగై పోయాయి. దాంతోపాటు కొత్త కొత్త రోగాలు మనల్ని చుట్టుముట్టాయి. రాగి పాత్రల్లో వంటల తయారీ, భోజనం చేయడం ఆరోగ్యకరమైన విషయాలని మన పెద్దలు చెప్పేవారు. ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ రాగి, ఇత్తడి మిశ్రమంతో తయారుచేసిన వస్తువులపై నిమిషాల్లోనే చనిపోతుందని సౌతాంప్టన్‌ యూనివర్సిటీలోని ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌కేర్‌ విభాగం ప్రొఫెసర్‌ బిల్‌ కీవిల్‌ వెల్లడించారు. అదే ఇన్‌ఫ్లూయెంజా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాలతోపాటు కొవిడ్‌-19 మహమ్మారి ఇతర వస్తువులపై నాలుగైదు రోజుల వరకు మనుగడ సాగించగలవు. తాజాగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాగి పాత్రలను వినియోగించడం ద్వారా నాలుగైదు గంటల్లోనే అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మనం నిత్యం వినియోగించే వస్తువులతోపాటు ఎక్కువగా ఉపయోగించే డోర్‌ హ్యాండిల్స్‌, ట్రాలీలు, హ్యాండ్‌ రెయిలింగ్‌ వంటి వాటికి రాగిపూత వేసినట్లయితే వైరస్‌ దరిచేరకుండా ఉంటుంది. 

గుండె సమస్యలు, క్యాన్సర్‌ రాకుండా చేయడంలో, శరీరం బరువు తగ్గించడంలో, యవ్వనంగా కనిపించడంలో, రక్తహీనత సమస్యలు రాకుండా ఉండేందుకు, గాయాలు తగ్గించడంలో రాగి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా థైరాయిడ్‌, ఆర్థరైటిస్‌ను అదుపులో ఉంచడమే కాకుండా ఇమ్యూన్‌ సిస్టంను బలోపేతం చేసి ఎములకు బలాన్నిస్తుంది. రాగితో చేసిన గాజులను ధరించడం వలన ఇస్నోమియా, న్యూరోసిస్‌, అధిక రక్తపోటు వంటి వాటిని కూడా నియంత్రించుకోవచ్చని నిపుణులు సెలవిస్తున్నారు.


logo