మిర్చి మిర్చి …మిర్చిలాంటి కుర్రాడే అని ఓ పాటుంది. ఆ పాటకు తగ్గట్టే పచ్చిమిర్చి తినడం వల్ల ఎన్నోప్రయోజనాలున్నా యంటున్నారు ఆరోగ్యనిపుణులు. ప్రతిఇంట్లో వండే కూరలో తప్పకుండా ఒకటిరెండు పచ్చిమిర్చి వేస్తుంటారు. అయితే తినేప్పుడు వాటిని కలిపి పక్కన పెట్టేస్తాం. పచ్చిమిర్చి తింటే ఆరోగ్యానికి హానికరమని.. అల్చర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని అంటుంటారు. అంతేకాదు.. డయబెటిక్ రోగులు వీటికి దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తుంటారు. అయితే పచ్చి మిర్చి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలిపెట్టరనే సంగతి తెలుసా.