ఆదివారం 17 జనవరి 2021
Health - Nov 25, 2020 , 21:34:09

ఛాయ్ లలో రకాలు.. వాటి లాభాలు

ఛాయ్ లలో రకాలు.. వాటి లాభాలు

హైద‌రాబాద్ : నేను బాగా అలసిపోయా.. వెంటనే ఛాయ్ పడాల్సిందే. అబ్బా తల నొప్పి విపరీతంగా వస్తుంది ఛాయ్ తాగితే గానీ తగ్గదు. ఇలాంటి మాటలు మనం చాలా మంది నోట చాలా సార్లు వినే ఉంటాం. అంతేకాదు.. ఉదయాన్నే లేవగానే ఛాయ్ పడకపోతే కానీ.. మైండ్ పని చేయని వారు కూడా ఉన్నారు. అందుకే ఛాయ్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా అంటే వేల్ల మీద లెక్కెయొచ్చు అంటుంటారు. మరి మన‌ల్ని తనకు బానిసలుగా మార్చుకున్న ఛాయ్ ఎన్ని రకాలు.. వాటి లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగడం వల్ల అరుగుదల బాగా ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధం లాంటిది.

2. అల్లం టీ

అల్లంలో ఉండే విటమిన్-సి, మినరల్స్ వికారం, నొప్పి, మంట లాంటివి తగ్గించడంతో పాటు.. రక్త సరఫరా పెంచుతుంది.  

3. బ్లాక్ టీ

బ్లాక్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది నోటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాక క్రానిక్ డిసీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

4. ఊలోంగ్ టీ

ఊలోంగ్ టీ ముఖ్యంగా చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఊలోంగ్ టీ బాగా ఉపయోగపడుతుంది.

5. మచ్చా టీ

ఇది కూడా గ్రీన్ టీ లాంటిదే. కానీ ఇది పొడిగా ఉంటుంది. ఇది తాగడం వల్ల ఎముకల్లో బలం రావడంతో పాటు కణాలు డ్యామేజ్ అవుకుండా ఉంటాయి.

6.పెప్పర్మెంట్ టీ

పెప్పర్మెంట్ టీ చాలా రుచిగా పరిమళభరితంగా ఉంటుంది. ఒక కప్పు టీ తాగితే చాలు ఒత్తిడి దూరమవడే కాక.. కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

7. హిబిస్కస్ టీ

దీంట్లో కెఫైన్ ఉండదు. హానికరమైన క్యాలరీలు కూడా ఉండవు. న్యూట్రిషియన్లతో నిండిన హిబిస్కస్ టీ మంచి హెల్త్ డ్రింక్ గా పనిచేస్తుంది.

8. చమ్మోలీ టీ

చమ్మోలీ టీ తాగడం వల్ల కడుపునొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి దూరం చేసి శరీరంలో ఇమ్యునిటీని పెంచుతుంది.

9. చాగా టీ

ఇది పుట్టగొడుగులతో తయారుచేసే టీ కాబట్టి చాలా న్యుట్రియన్లను కలిగి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు చాలా టీ బాగా పనిచేస్తుంది.

10. క్రిసాన్తెమమ్ టీ

తేలికపాటి పూల వాసనతో నిండే క్రిసాన్తెమమ్ టీ రుచిలో చాలా తియ్యగా ఉంటుంది. ఇది మీ నరాలను చల్లబరిచి.. మంట, నొప్పి వంటి వాటికి దూరంగా ఉంచుతుంది.