నైట్ షిఫ్ట్ జాబ్స్ చేసేవారికి టైప్ 2 డయాబెటిస్ ముప్పు..!


Tue,February 13, 2018 07:04 PM

నైట్ షిఫ్ట్ జాబ్స్ చేస్తున్నారా ? అయితే జాగ్రత్త. మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే.. డే షిఫ్ట్ జాబ్ చేసే వారితో పోలిస్తే నైట్ షిఫ్ట్ జాబ్ చేసే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 44 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. డయాబెటిస్ కేర్ అనబడే ఓ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఈ విషయాన్ని వైద్యులు వెల్లడిస్తున్నారు. సదరు అధ్యయనంలో భాగంగా మొత్తం 2.70 లక్షల మందిని సైంటిస్టులు పరిశీలించారు. వారి ఆహారపు అలవాట్లు, చేస్తున్న ఉద్యోగం, వారికి ఉన్న వ్యాధులు తదితర సమాచారాన్ని సేకరించారు. అనంతరం తెలిసిందేమిటంటే.. వారిలో నైట్ షిఫ్ట్ చేస్తున్న 6వేల మందికి అంటే మొత్తంలో దాదాపుగా 44 శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు తేల్చారు. మరికొంతమందికి ప్రీడయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవారు టైప్ 2 డయాబెటిస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చేస్తే దాని బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చని అంటున్నారు.

3688

More News

VIRAL NEWS