శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 20, 2020 , 12:34:21

న‌స‌'ద‌గ్గు' ఎంత‌కీ వ‌ద‌ల‌ట్లేదా? ఇలా చేస్తే త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం!

న‌స‌'ద‌గ్గు' ఎంత‌కీ వ‌ద‌ల‌ట్లేదా? ఇలా చేస్తే త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం!

వ‌ర్షాకాలం మొద‌లైందంటే చాలు జ‌లుబు, ద‌గ్గుతో పోరాడుతుంటారు. ద‌గ్గులో ర‌కాలు కూడా ఉంటాయి. ప‌గ‌లంతా బాగుండి రాత్రి ప‌డుకున్న‌ప్పుడు ద‌గ్గు ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి వాటికి సిర‌ప్‌లు, టాబ్లెట్స్ వేసుకోవ‌డం సెకండ‌రీ. మొద‌ట‌గా ప్ర‌థ‌మ చికిత్స చేసుకోవాలి. అవి ఇంట్లోనే స‌హ‌జ ప‌ద్ద‌తిలో చేసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి. 

* ముందుగా ఒక గ్లాసులో గోరువెచ్చ‌ని నీరు తీసుకొని కొంచెం నిమ్మ‌ర‌సం, తేనె వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. 

* కొన్నిసార్లు మొండి ద‌గ్గు బాగా స‌తాయిస్తుంది. దాని నుంచి విముక్తి పొందాలంటే పైనాపిల్ పండ్ల‌లో ఉండే బ్రొమెలెన్ చ‌క్క‌ని ప‌రిష్కారం. త‌ర‌చూ పైనాపిల్ పండ్లు తిన‌డం వ‌ల్ల ద‌గ్గు బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు.  

* నార్మ‌ల్‌గా క‌షాయం తాగితే ఎలాంటి జ‌బ్బులు ద‌రిచేర‌వు అంటారు. కానీ ద‌గ్గు వ‌చ్చిన‌ప్పుడు కొంచెం నీటిలో పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఆ నీరు స‌గం అయ్యేంత‌వ‌ర‌కు మ‌రిగిన త‌ర్వాత వేడివేడిగా తాగితే ద‌గ్గు వెంట‌నే త‌గ్గిపోతుంది.  

* ఇవన్నీ ఎందుకులే అనుకుంటే గోరువెచ్చ‌ని నీటిలో కొంచెం అల్లంర‌సం, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్లార‌క ముందే తాగితే త‌క్ష‌ణ‌మే ద‌గ్గు నుంచి ఉపశ‌మ‌నం పొంద‌వ‌చ్చు.  

* క‌రోనా టైంలో ప్ర‌తిరోజూ క‌షాయం తాగ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. అల్లం, దాల్చిన‌చెక్క‌, ల‌వంగాలు, మిరియాలు వేసి వైరైటీగా మ‌సాలా టీ చేసుకొని సేవిస్తే ద‌గ్గు పోవ‌డంతోపాటు మ‌ళ్లీ ర‌మ్మ‌న్నా రాదు. 


తాజావార్తలు


logo