శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Health - Mar 07, 2020 , 19:01:45

విటమిన్‌ డి అందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి..!

విటమిన్‌ డి అందాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి..!

మన శరీరానికి అవసరం అయిన అనేక విటమిన్లలో విటమిన్‌ డి కూడా ఒకటి. ఇది లోపిస్తే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనంగా మారిపోయి త్వరగా విరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డిప్రెషన్‌, పిల్లల్లో రికెట్స్‌, థైరాయిడ్‌ వంటి వ్యాధులు వస్తాయి. అయితే నిత్యం 15 మైక్రోగ్రాముల మోతాదులో విటమిన్‌ డిని తీసుకుంటే ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను కింద సూచించిన ఆహారాలను మనం నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే... 

* చేపలను తినడం వల్ల 11.1 నుంచి 17.8 మైక్రోగ్రాముల వరకు విటమిన్‌ డిని పొందవచ్చు. ఇది నిత్యం మనకు సరిపోతుంది. 

* మటన్‌ లివర్‌లోనూ విటమిన్‌ డి పుష్కలంగానే ఉంటుంది. 85 గ్రాముల మటన్‌ లివర్‌ తినడం వల్ల 1 మైక్రోగ్రాము వరకు విటమిన్‌ డి లభిస్తుంది. దీంతో మనకు రోజులో కావల్సిన విటమిన్‌ డిలో 5 శాతం వరకు అందుతుంది. 

* మటన్‌ కిడ్నీల్లోనూ విటమిన్‌ డి ఉంటుంది. 85 గ్రాముల కిడ్నీలు తింటే 0.9 మైక్రోగ్రాముల విటమిన్‌ డి అందుతుంది. దీంతో మనకు రోజులో కావల్సిన విటమిన్‌ డిలో 4.5 శాతం వరకు అందుతుంది. 

* ఒక కోడిగుడ్డు పచ్చ సొనలో 0.9 మైక్రోగ్రాముల విటమిన్‌ డి ఉంటుంది. అలాగే ఒక కప్పు పుట్టగొడుగుల్లో 3.4 మైక్రోగ్రాముల వరకు విటమిన్‌ డి లభిస్తుంది. ఇక పాలు, పెరుగు, నారింజ పండ్లు, తృణ ధాన్యాల్లోనూ మనకు కావల్సినంత విటమిన్‌ డి లభిస్తుంది. logo