చలికాలంలో వెచ్చగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Sat,November 23, 2019 12:18 PM

చలికాలంలో సహజంగానే మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తాం. అందుకనే ఈ కాలంలో స్వెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు తదితర దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటాం. అయితే దుస్తుల వరకు ఓకే.. కానీ.. మనం నిత్యం తీసుకునే పలు ఆహార పదార్థాలను కూడా మార్చినట్లయితే ఈ కాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అందుకు ఏమేం ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!


* పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపు కలుపుకుని తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

* మన శరీరానికి వెచ్చదనం అందించడంలో అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. నిత్యం అల్లం టీని సేవిస్తే చలి బారి నుంచి తప్పించుకోవచ్చు.

* నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు లేదా పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీరం వెచ్చగా ఉంటుంది.

* దాల్చినచెక్క మన శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగి వెచ్చదనం లభిస్తుంది. నిత్యం దాల్చిన చెక్క పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

* నువ్వులు, బాదం పప్పు, కోడిగుడ్లు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు.

* ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ కుంకుమ పువ్వు లేదా నల్ల మిరియాల పొడి కలుపుకుని తాగితే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అలాగే వేడి వేడి సూప్‌లను సేవించడం వల్ల కూడా చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

4592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles