మెంతుల‌తో ఏయే అనారోగ్యాలు త‌గ్గుతాయంటే..?


Sun,December 2, 2018 07:07 PM

మెంతులకు భార‌తీయుల వంట‌ల్లో ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మెంతుల‌ను పోపు గింజ‌ల‌తో క‌లిపి వాడుతారు. కొంద‌రు వీటిని వివిధ ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. అయితే వంట‌ల‌కే కాదు, మెంతులు ఔష‌ధ గుణాల‌కూ పెట్టింది పేరుగా ఉన్నాయి. వీటిల్లో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతుల‌తో మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతుల వాడకంతో తగ్గించవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇవి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను మెంతులు నియంత్రిస్తాయి. అధిక బరువు సమస్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే మెంతుల‌ను వాడాలి.

2. షుగర్‌ వ్యాధితో బాధపడేవారికి మెంతులు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడంతోపాటు, షుగ‌ర్‌ను అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం అరస్పూన్‌ మెంతిపొడి తీసుకుంటే చాలావ రకు సమస్య త‌గ్గుతుంది. మెంతులు టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తాయి. మెంతుల్లో ఉండే ఔష‌ధ గుణాలు మధుమేహం మీద పని చేస్తాయి.

3. మెంతులు జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేసి ఆకలిని పెంచుతాయి. చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది. నీళ్ల విరేచనాలను అరికట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో అల్సర్లని తగ్గించడంతోపాటు పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. వీటిలోని చేదుగుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది.

4. పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేస్తాయి. మెంతుల్లో ఉండే ఔషధ కార‌కాలు మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయం లోని చెడు రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. తల్లిపాల తయారీకి మెంతులు ప‌నిచేస్తాయి.

5. మెంతులు నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి నివారణలోనూ ప‌నిచేస్తాయి. ఎముకలను శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్‌, నడుము నొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో మెంతులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి.

14028

More News

VIRAL NEWS