చలికాలంలో మెంతి ఆకులు చేసే మేలు మరువకండి..!

Tue,December 10, 2019 11:00 AM

పాలకూర, తోటకూర.. తదితర ఆకుకూరల్లాగే మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


* చలికాలంలో చెమట పట్టేలా వ్యాయామం చేయాలంటే అందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే మెంతి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వ్యాయామం త్వరగా పూర్తి చేయవచ్చు. అలాగే చలికాలంలో బరువు తగ్గాలనుకునే వారు త్వరగా బరువు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

* మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

* డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం సహజంగానే కొంత కష్టతరమవుతుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

* చలికాలంలో జీర్ణ సమస్యలు కూడా సహజంగానే వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.

3511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles