పాప్‌కార్న్ తింటే కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలివే..!

Thu,December 12, 2019 11:46 AM

సాధారణంగా మనలో అధిక శాతం మంది కేవలం థియేటర్లకు సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు మాత్రమే పాప్‌కార్న్ ఎక్కువగా తింటుంటారు. అయితే నిజానికి పాప్‌కార్న్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా తినవచ్చు. దాంతో మనకు లాభాలే కలుగుతాయి. పాప్‌కార్న్‌లో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు మనకు కలిగే అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయి. మరి తరచూ పాప్‌కార్న్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!


* పాప్‌కార్న్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాప్‌కార్న్‌ను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

* పాప్‌కార్న్‌లో ఉండే ప్రోటీన్ మనకు శక్తినిస్తుంది. రోజంతా శక్తితో, ఉత్సాహంగా ఉండాలంటే పాప్‌కార్న్ తినాలి.

* పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

* పాప్‌కార్న్ తినడం వల్ల అధికంగా క్యాలరీలు చేరతాయనే భయం ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కని ఆహారంగా ఉపయోగపడతాయి. తక్కువ పాప్‌కార్న్ తిన్నా చాలా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గుతారు.

4835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles