చిరు ధాన్యాల ఆహారంతో బోలెడు లాభాలు..!


Sun,January 13, 2019 09:28 AM

పూర్వం మ‌న పెద్ద‌లు చిరు ధాన్యాల‌ను ఎక్కువ‌గా తినేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఒక్కొక్క‌రు 100 ఏళ్ల‌కు త‌క్కువ కాకుండా జీవించే వారు. కానీ ఇప్పుడు మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల మ‌న ఆయుర్దాయం రోజు రోజుకీ త‌గ్గిపోతున్న‌ది. మ‌నం ఎక్కువ‌గా పాలిష్ చేయ‌బ‌డిన బియ్యం తిన‌డం వ‌ల్లే స‌మ‌స్యంతా వ‌స్తున్న‌ది. అందుకు బ‌దులుగా చిరు ధాన్యాల‌ను వారంలో క‌నీసం 3 రోజులు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. దాంతో పోష‌కాలే కాదు, ఆరోగ్యం కూడా ల‌భిస్తుంది.

చిరు ధాన్యాలను తృణధాన్యాలు, సిరి ధాన్యాలు అని కూడా అంటారు. కొర్రలు, రాగులు, సామలు, అరికలు, వరిగలను సిరి ధాన్యాలు అంటారు. ఐదు రకాల సిరి ధాన్యాలు అని కూడా అంటారు. ఇవి వేరే దేశంలో ఎక్కడా కనిపించవు. భారతదేశంలోనే కనిపిస్తాయి. అయితే ఇవి వందల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వచ్చాయని అంటుంటారు. ఇప్పుడిప్పుడు జనాల్లో వస్తున్న అవగాహన వల్ల సిరి ధాన్యాలకు ఆదరణ లభిస్తున్నది. కానీ లభ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్‌కు తగిన సిరి ధాన్యాలు అందడం లేదు. సాగుకూడా చాలా సులభంగా ఉంటుంది. ఉదాహరణకు కిలో వరి పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరమైతే కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు సరిపోతుంది. 75 రోజుల్లోనే చేతికొచ్చే సిరి ధాన్యాలు చాలా ఉన్నాయి.


మనం ఇప్పుడు తింటున్న తిండి ఏంటి? ఏ ఒక్కదాంట్లో పోషక విలువలు ఉండవు. అంతా ప్రాసెస్డ్ ఫుడ్డే. నిల్వ సరిగా ఉండదు. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా ఒక రకంగా మనం విషాహారాన్నే తింటున్నాం. దీనికంతటికీ కారణం మన జీవనశైలే. సంపూర్ణమైన ఆరోగ్య జీవితాలు పొందాలి అంటే మనం కచ్చితంగా సిరి ధాన్యాల వైపు అడుగులు వేయాల్సిందే. తిరిగి పూర్వీకుల ఆహార పద్ధతులు అవలభించడమే. మనం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే ఆహారంలో కార్బో హైడ్రేట్స్, ప్రొటీన్స్, కొవ్వులు, మినరల్స్, మైక్రో న్యూట్రిషియంట్స్ స‌మ‌పాళ్ల‌లో ఉండాలి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో ఇవి అస్త‌వ్య‌స్తంగా ఉంటున్నాయి. పాలిష్ చేయ‌బ‌డిన బియ్యంలో మొత్తం కార్బొహైడ్రేట్లే ఉంటాయి. ఫైబ‌ర్ ఉండ‌దు. ఇక మ‌నం తింటున్న జంక్ ఫుడ్‌లో కొవ్వులు మాత్ర‌మే ఉంటాయి. ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. దీనివ‌ల్ల పోషకాహార లోపం వ‌స్తున్నది. అలా కాకుండా ఉండాలంటే, మన పూర్వీకుల మాదిరిగా మనం కూడా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలంటే సహజమైన పోషకాలు లభ్యమయ్యే సిరిధాన్యాలు తీసుకోవాలి.


సిరి ధాన్యాలలో ఇనుము, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు సిరి ధాన్యాల నుంచి ఒక రోజుకు అవసరమైన మాంగనీస్ 33 శాతం, ట్రిప్టోఫాన్ 32 శాతం, మెగ్నీషియం 27 శాతం, ఫాస్పరస్ 24 శాతం లభిస్తాయి. వరి, గోధుమల కన్నా ఎన్నో రెట్లు అధికమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి. సిరి ధాన్యాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లల ఎదుగుదలకు, వృద్ధులలో, మహిళల్లో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి తోడ్పడుతాయి. వీటిలో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై, శోషితం కాకుండా చేయడం ద్వారా ఆహారంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదల అవుతాయి. కాబట్టి మధుమేహ రోగులకు ఇవి మంచి ఆహారం.

సిరిధాన్యాల్లో పీచు పదార్థం 8-12.5 శాతం ఉంటుంది. వీటిని తిన్న తర్వాత నెమ్మదిగా 6-8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేస్తాయి. సిరిధాన్యాలతో కూడిన ఆహారం తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. వరి, గోధుమ, మొక్కజొన్న ఆహారం పాలిషింగ్ రూపంలో తీసుకోవడం వల్ల డయాబెటిస్, ఒబెసిటీ, ట్రైగ్లిజరైడ్స్ సమస్య, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు, నొప్పుల నుంచి విముక్తి పొందేందుకు ప్రజలు ఇప్పుడిప్పుడే ఆరోగ్య స్పృహతో సిరి ధాన్యాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సిరి ధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్నది.

వారంలో 2 రోజులు ఫాక్స్ టెయిల్ మిల్లెట్ రైస్, లిటిల్ మిల్లెట్ రైస్, కోడో మిల్లెట్ రైస్, బార్న్‌యార్డ్ మిల్లెట్ రైస్, బ్రౌన్‌టాప్ మిల్లెట్ రైస్ ల‌లో ఏదైనా ఒక రైస్ తీసుకుంటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం వారంలో 1 రోజు ఫాక్స్‌టెయిల్ మిల్లెట్ రైస్, లిటిల్ మిల్లెట్ రైస్, కోడో మిల్లెట్ రైస్, బార్న్‌యార్డ్ మిల్లెట్ రైస్, బ్రౌన్‌టాప్ మిల్లెట్ రైస్ ల‌లో ఏదైనా ఒక రైస్ తీసుకోవాలి. సిరి ధాన్యాల‌ను తిన‌డం వ‌ల్ల నరాల వ్యవస్థ బలపడుతుంది. ఏవైనా సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నా నయం అవుతాయి. పార్కిన్‌సన్, మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. అనీమియా వ్యాధి నివారించబడుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. మధుమేహం తగ్గుతుంది. నిద్ర‌లేమి వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. పేగు, కాలేయ సంబంధిత వ్యాధులు రావు. అధిక కొవ్వు త‌గ్గుతుంది. అంతస్రావ గ్రంథి సమస్యలు పరిష్కారం అవుతాయి. గర్భాశయ, పీసీఓడీ సమస్యలు రావు. సంతాన సాఫల్యం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. కీళ్ల వ్యాధులు రావు. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. కంటి సమస్యలు రావు. స్థూలకాయ సమస్యలు పరిష్కారం అవుతాయి.

6182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles