డ‌యాబెటిస్‌, అధిక బ‌రువుకు చెక్ పెట్టే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్


Sat,October 20, 2018 07:30 PM

వంట‌ల్లో చాలా మంది ఎక్కువ‌గా వెనిగ‌ర్‌ను ఉపయోగిస్తారు క‌దా. అయితే ఈ వెనిగ‌ర్ కాకుండా మరో వెనిగ‌ర్ కూడా ఉంది. అదే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌. దీన్ని పోష‌క ప‌దార్థంగా, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసే ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తున్నారు. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వ‌ల్ల మ‌నం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అనేక రకాల పోషక పదార్థాలకు నిలయం యాపిల్ సైడర్ వెనిగర్. సిట్రిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సక్సీనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ వంటివి ఇందులో ఉంటాయి. యాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త‌దిత‌ర‌ ఇతర పోషకాలన్నీ దాదాపుగా ఇందులోనూ ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు పోతాయి.

2. యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవడం వల్ల గుండె మంచి కండిషన్‌లో ఆరోగ్యవంతంగా ఉంటుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలోని ట్రైగ్లిజరిడ్స్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ వంటి చెడు కొలెస్ట్రాల్‌ను ఇది తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్స్) పెరిగేందుకు దోహదపడుతుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

3. రక్తంలోని చక్కెర స్థాయిలను యాపిల్ సైడర్ వెనిగర్ గణనీయంగా తగ్గిస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే శాతాన్ని, ఇన్సులిన్ యాక్టివిటీని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను సేవిస్తే ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌ను తరచూ తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

4. అధిక బరువును యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ త‌గ్గిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకున్న తరువాత ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. తద్వారా ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

5. యాపిల్ సైడర్ వెనిగ‌ర్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. శరీరంలో అసాధారణ రీతిలో కణాలు పెరగకుండా నిరోధించడంతోపాటు ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో అనేక రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. శరీరంలో ఏర్పడే ట్యూమర్ల సైజ్‌ను ఇది తగ్గిస్తుంది.

6. హానికరమైన బాక్టీరియాను నిర్మూలించడంతోపాటు శరీరంలోని విష పదార్థాలను యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ తొలగిస్తుంది. వెంట్రుకలకు సహజసిద్ధమైన కండిషనర్‌గా, దంతాలను శుభ్రం చేసే ద్రావకంగానూ పనిచేస్తుంది. ఆహార పదార్థాలకు డ్రెస్సింగ్ చేయడంలో, మారినేడ్స్, సాసెస్, గ్రేవీస్, పికిల్స్ తయారీలో దీన్ని వాడుతారు. యాపిల్స్ నుంచి తయారైనప్పటికీ ఇందులో దానికి సంబంధించిన రుచి తక్కువగానే ఉంటుంది. సాధారణ వెనిగర్‌కు ఉండే వాసన దీనికి తక్కువగా ఉంటుంది.

6032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles