HomeLATEST NEWStop 5 spices that reduces over weight in no time

అధిక బ‌రువు త‌గ్గాలా..? వీటిని ఆహారంలో భాగం చేసుకోండి..!

Published: Sun,January 14, 2018 08:44 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మ‌సాలాలు, కారం లేనిదే.. మ‌న వంట‌కాలు పూర్తి కావు. ముఖ్యంగా ప‌లు వెజిటేరియ‌న్ వంట‌కాల‌తోపాటు నాన్‌వెజ్ వంట‌కాల్లో మ‌సాలాలు, కారంను దిట్టంగా వేస్తారు. అలా వేస్తేనే క‌దా ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌చ్చేది. అయితే మీకు తెలుసా ? మ‌నం నిత్యం వాడే ప‌లు మ‌సాలాలతో స్థూల‌కాయం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప‌లు అధ్య‌య‌నాలు కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. మ‌సాలాల‌ను వాడ‌డం వ‌ల్ల మన‌కు చ‌క్క‌ని రుచి మాత్ర‌మే కాదు, అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి మ‌న శ‌రీర బ‌రువును త‌గ్గించే ఆ మ‌సాలా ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. దాల్చిన చెక్క


రోజూ ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే చాలు, అధిక బరువు క్రమంగా తగ్గుతుంది. ఆరోగ్యం, అందం కూడా మెరుగుపడుతుంది. దీంట్లో రక్తంలోని గ్లూకోజ్‌ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ను 27 శాతం వరకు తగ్గిస్తుంది. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ప్రయోజనాలను ఇస్తుంది. రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అయితే దీన్ని మోతాదుకు మించి మాత్రం తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీంట్లో ఉండే కొమారిన్ అనే కెమికల్ కాలేయానికి హాని చేస్తుంది.

2. మిరపకాయలు


మిరపకాయల్లో క్యాప్సెయిసిన్‌ అనే రసాయనం ఉంటుంది. దీనికున్న గుణమేమిటంటే కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచి శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఆకలి పుట్టించే గుణం కూడా వీటికి ఉంది. వీటిలోని రసాయనాలు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూస్తాయి.

3. నల్ల మిరియాలు


ప్రస్తుతం వీటి వాడకం మన ఆహారంలో బాగా తగ్గింది. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు తమ ఆహారంలో వీటిని తరచూ ఉపయోగించేవారు. ఇవి జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. మనం తినే ఆహారం నుంచి శరీరానికి పోషకాలను అందేలా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడతాయి. శరీర బరువును సమతుల్యంగా ఉంచుతాయి.

4. ఆవాలు


మెటబాలిజం ప్రక్రియను ఇవి ఉత్తేజం చేస్తాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు వేగంగా కరిగి తద్వారా బరువు కూడా తగ్గుతారు. రోజుకో చెంచా ఆవ పిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు వేగవంతమవుతాయని ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తెలిసింది. అధిక రక్తపోటును తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుంది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రోటీన్లు, కాల్షియం, నియాసిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.

5. అల్లం


ఆయుర్వేదంలో అల్లానికి చాలా ప్రాధాన్యత ఉంది. మూత్ర విసర్జన సాఫీగా జరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. తద్వారా శరీర బరువు త‌గ్గుతుంది. మనం తీసుకునే ఆహారంలోని చెడు పదార్థాలను బయటికి పంపివేస్తుంది. పలు రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి అల్లానికి ఉంది. జలుబు, మైగ్రేన్, మగత వంటి వాటిని తొలగిస్తుంది.
6703
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology