రాగులతో రక్తహీనతకు చెక్..!


Sun,December 9, 2018 01:13 PM

ప్రస్తుతం చాలా మంది తినడం మానేశారు కానీ.. ఒకప్పుడు మన పూర్వీకులు రాగులను ఎక్కువగా తినేవారు. వీటితో జావ, రొట్టెలు చేసుకుని తినేవారు. అందుకే వారు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే రాగులను నిత్యం తింటే దాంతో మధుమేహం, బీపీ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే రాగులతో ఇంకా మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాగులతో తయారుచేసే మాల్ట్‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

2. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ, మాల్ట్ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.

3. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతలు దృఢంగా మారుతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

4. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

5. అధిక బరువును తగ్గించడంలో, శరీరానికి మానసిక ప్రశాంతతను అందజేయడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తలనొప్పి తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళనను నివారించే గుణాలు రాగుల్లో ఉంటాయి.

5931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles