తాటిబెల్లంతో క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Tue,January 22, 2019 05:50 PM

చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లం తింటే ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో తాటి బెల్లం అనే మాట మ‌న‌కు బాగా విన‌బ‌డుతున్న‌ది. కానీ నిజానికి ఇది ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చింది కాదు. పూర్వ కాలం నుంచి తాటి బెల్లంను వాడుతున్నారు. సుమారుగా 100 సంవ‌త్స‌రాల కింద‌ట వ‌స్తుగుణ దీపిక అనే పుస్త‌కంలో తాటి బెల్లం గురించి ఆయుర్వేద వైద్యులు పలు ముఖ్య‌మైన విష‌యాల‌ను రాశారట‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం తాటి బెల్లం వాడ‌కం ప‌ట్ల అంద‌రూ ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే దీన్ని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తాటిబెల్లంలో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, ఫాస‌ర్ప‌ర‌స్ ఉండడం వ‌ల్ల మ‌న‌కు తాటి బెల్లంతో సంపూర్ణ పోష‌ణ అందుతుంది.

2. తాటిబెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది.

3. తాటిబెల్లం రోజూ తిన‌డం వ‌ల్ల శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలూ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ తాటిబెల్లం స‌హాయ పడుతుంది.

4. తాటిబెల్లం తిన‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో బాగా వేడి ఉన్న‌వారు తాటిబెల్లం తిన‌డం మంచిది.

5. చిన్న పిల్ల‌లకు తాటిబెల్లం తినిపిస్తే వారు నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. వారికి కావ‌ల్సిన శ‌క్తి బాగా అందుతుంది.

14418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles