వేల సంవత్సరాలుగా ఆవాలను వంటల్లో వాడుతున్నారు. ఆవాలు లేని పోపు ఊహించలేము. ఊరగాయలు, పచ్చళ్లు, కొన్ని ప్రత్యేక వంటకాలకు ఆవాలు ప్రత్యేక రుచిని కూడా ఇస్తాయి. ఆవాల్లోనూ పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి.
1. ఆవాల్లో ఫైటో న్యూట్రియేట్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆవాల్లో విటమిన్ బి3 చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రతి రోజు ఆవాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. రక్తనాళాలు గట్టి పడకుండా నివారించడమే కాదు బీపీని కూడా ఆవాలు అదుపులో ఉంచుతాయి.
2. ఆవాలలో మ్యూసిలేజ్ అనే ఒక చిక్కటి పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజుకు ఒక టీ స్పూన్ ఆవపిండిని తీసుకోవడం ద్వారా మలబద్దకానికి దూరంగా ఉండొచ్చు.
3. ఆవాలు యాంటి ఇన్‌ఫ్లామేటరీ ఏజెంట్లలా కూడా పనిచేస్తాయి. కీళ్లు, కండరాల నొప్పిని కూడా తగ్గిస్తాయి. వారంలో ఒకసారి గోరువెచ్చని ఆవ నూనెతో మసాజ్ చెయ్యడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను ఆవాలు నివారిస్తాయి. ఆస్తమాతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి చేస్తాయి.
4. శరీరం నుంచి వ్యర్థాలు విసర్జితం కావడానికి తోడ్పడుతాయి. ఫ్లూ, దగ్గు, జ్వరం నుంచి ఆవాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అర టీ స్పూన్ ఆవాలు చప్పరించడం ద్వారా దంతాల నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
5. వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మం మీద ఏర్పడే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. జుట్ట బాగా పెరగానికి ఇది దోహదం చేస్తుంది. అంతేకాదు చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.