బొప్పాయిని రెగ్యుల‌ర్‌గా తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!


Thu,January 18, 2018 04:00 PM

బొప్పాయి పండు ఏడాది పొడవునా మనకు విరివిగా లభిస్తుంది. అంత ఎక్కువ ధ‌ర కాకుండా సామాన్యుల‌కు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది బొప్పాయి పండును తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. ఈ పండును రెగ్యుల‌ర్ గా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే బొప్పాయి పండును త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చర్మ సంరక్షణకు బొప్పాయి బాగా పనిచేస్తుంది. ముఖంపై ఏర్పడిన మచ్చలను, మొటిమలనే కాక, వివిధ చర్మ వ్యాధుల‌ను కూడా బొప్పాయి త‌గ్గిస్తుంది. . చర్మంలో ఏర్పడే మృత కణాలను, మృత చర్మాన్ని పోగొడుతుంది. చర్మం మరింత ప్రకాశించేందుకు బొప్పాయి తోడ్పడుతుంది. వయస్సు మీద పడిన వారిలోనూ ఇది తన ప్రభావాన్ని చూపిస్తుంది. వారి సౌందర్యాన్ని పెంచుతుంది.

2. శరీరంలో రక్తకణాలలోని కొవ్వును తొల‌గించ‌డంతోపాటు గుండెపోటు రానీయకుండా చూస్తుంది. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి బ‌య‌ట‌కు పంపుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రోజూ బొప్పాయిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. మలబద్దకానికి బొప్పాయి మంచి మందు.

3. విటమిన్ ఎ, సిలు బొప్పాయిలో ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. జ్వరం, జలుబు, ఫ్లూతో బాధపడే వారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ బొప్పాయి తినడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. మహిళల్లో తలెత్తే రుతు సంబంధ సమస్యలను తొలగిస్తుంది. కాలేయ సమస్యలను నివారిస్తుంది. కాలేయంలో ఉండే క్యాన్సర్ కారక క్రిములను నాశనం చేస్తుంది.

5. అధిక బరువు ఉన్నవారు నిత్యం బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉన్న పోషకాలు తక్కువ క్యాలరీలను అందజేస్తాయి. సన్నగా మారాలనే వారికి బొప్పాయి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.

9992

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles