రోజూ అరటిపండ్లను తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలివే..!


Tue,January 30, 2018 12:46 PM

అరటిపండ్లను శక్తినిచ్చే ఆహార పదార్థంగానే చాలా మంది చూస్తారు. కానీ నిజానికి వాటిలో ఉండే ఔషధ గుణాలు, వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అరటిపండ్లను రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు, పీచు పదార్థం అందుతాయి. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకు మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. అరటి పండ్లను రెగ్యులర్‌గా తింటే మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండానే పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. మరి అరటి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ప్రిమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్)


అరటి పండ్లలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అరటి పండ్లను రెగ్యులర్‌గా తింటే అందులో ఉండే బి విటమిన్ల వల్ల పీఎంఎస్ వ్యాధి నుంచి బయట పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతోపాటు రుతు సమయంలో మహిళలకు వచ్చే కడుపు నొప్పి, ఛాతి నొప్పి, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. హైబీపీ


హైబీపీని నియంత్రించడంలో అరటి పండ్లు అమోఘంగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అందుకే హైబీపీ తగ్గుతుంది. రోజూ అరటి పండ్లను ఆహరంలో భాగం చేసుకుంటే దాంతో గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.

3. డిప్రెషన్


అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలో హ్యాపీ హార్మోన్ అయిన సెరటోనిన్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడి సమస్యల నుంచి బయట పడవచ్చు. సెరటోనిన్ మన మూడ్‌ను మార్చి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది.

4. మలబద్దకం


అరటిపండ్లలో పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. దీంతోపాటు శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా పెక్టిన్ వల్ల బయటకు వెళ్లిపోతాయి. అరటిపండ్లలో ఉండే ఫైబర్ సహజసిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య ఉండదు. విరేచనం సాఫీగా అవుతుంది.

5. హార్ట్ బీట్


నిత్యం ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యేవారిలో మెటబాలిజం రేటు పెరుగుతూ ఉంటుంది. దీంతో పొటాషియం తగ్గుతుంది. అరటిపండ్లను తినడం వల్ల పొటాషియం పెరిగి గుండె కొట్టుకోవడం సామాన్య స్థితికి వస్తుంది. ఆందోళన తగ్గుతుంది. శరీరంలో ద్రవాలు నియంత్రణలో ఉంటాయి.

5802

More News

VIRAL NEWS