ఈ ఆహారాలను తీసుకుంటే.. మెదడు పని మటాషే..!


Wed,February 14, 2018 07:50 PM

మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే అందుకు మెదడు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులు, గుండె, కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు ఏవైనా సరే.. అన్నీ మెదడుకు అనుసంధానం అయి ఉంటాయి. ఈ క్రమంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేయాలంటే.. ముందు మెదడు యాక్టివ్‌గా ఉండాలి. అయితే నిత్య జీవితంలో మనం తీసుకునే పలు ఆహార పదార్థాలు మెదడు పనితీరును మందగింపజేస్తాయి. దీంతో అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి మన మెదడు పనితీరుపై నెగెటివ్‌గా ప్రభావం చూపించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రిఫైన్డ్ పిండిపదార్థాలు


ప్రాసెస్ చేయబడిన గోధుమలు, జొన్నలు, రాగులలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. వీటితోపాటు పాలిష్ చేయబడిన బియ్యం, తృణ ధాన్యాలు, బ్రెడ్ వంటి వాటిలోనూ రిఫైర్డ్ పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ భారీగా పెరిగి అది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కనుక ఈ ఆహారాలను తీసుకోవడం మానేయాలి. వీటికి బదులుగా పప్పు దినసులు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

2. మద్యం


మద్యం సేవించడం వల్ల కేవలం లివర్, జీర్ణాశయం మాత్రమే కాదు, మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. ఆల్కహాల్ మన మెదడుపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలను చూపిస్తుంది. మెదడులో ఉండే న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఆల్కహాల్ వల్ల నాశనం అవుతాయి. ఫలితంగా విటమిన్ బి1 లోపం సంభవిస్తుంది. ఇది మెదడు సమస్యలకు కారణమవుతుంది.

3. చక్కెర పానీయాలు


ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలలో చక్కెర అధికంగా ఉంటుంది. దీని వల్ల ఈ డ్రింక్స్‌ను తీసుకున్నప్పుడు అవి రక్తంలో నేరుగా కలిసి తద్వారా గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ తరహా డ్రింక్స్‌ను కూడా మానేయాలి. బదులుగా ఐస్డ్ టీ, తాజా పండ్లు, కూరగాయల రసాలు (ఇంట్లో చేసుకున్నవి), చక్కెర లేని పాలు తదితర ఆహారాలను తీసుకోవచ్చు.

4. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు


ఇన్‌స్టంట్ నూడుల్స్, చిప్స్, రెడీ మేడ్ మీల్స్, సాస్‌లు తదితర ఆహారాలు ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకు వస్తాయి. వీటిని తిన్నా మెదడు పనితీరు మందగిస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, చేపలు, మాంసం తినవచ్చు.

5. ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం


ఆయిల్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్‌లలో ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉన్న ఆహారం తింటే మెదడు పనితీరు ప్రభావితం అవుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా ఉండదు. వీటికి బదులుగా చియా సీడ్స్, వాల్ నట్స్, అవిసె గింజలు తినవచ్చు.

9004

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles