బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Jan 27, 2020 , 18:55:03

జలుబు త్వరగా తగ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

జలుబు త్వరగా తగ్గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

సీజన్లు మారినప్పుడు.. అలర్జీలు ఉన్నవారికి.. శీతలపానీయాలు పడని వారికి.. ఇంకా అనేక రకాల కారణాల వల్ల అనేక మంది జలుబు చేస్తుంటుంది. అయితే జలుబు వస్తే ఒక పట్టాన తగ్గదు. దానికి తోడు ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. అయితే కింద సూచించిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు. అవేమిటంటే...

  • గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్‌ టీని తాగితే శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. దీంతో జలుబు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్‌ టీని తాగడం వల్ల జలుబును తగ్గించుకోవచ్చు.
  • వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే జలుబు త్వరగా తగ్గుతుంది.
  • నారింజ పండ్లలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి.
  • పుట్టగొడుగులు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్‌ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది.
  • పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్‌ సూప్‌ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.

logo
>>>>>>