జుట్టు చిట్లకుండా ఉండాలంటే..


Mon,October 8, 2018 11:02 PM

* నిమ్మరసంలో కొద్దిగా లావెండర్ నూనె, గుడ్డులోని పచ్చసొన కలిపి బాగా గిలక్కొట్టండి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల దాకా అంటేలా రాయండి. 40 నిమిషాలు ఉండనిచ్చి షాంపూతో తలస్నానం చేయండి.
* బాదం నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, విటమిన్ ఎలు ఎక్కువ. అందుకే మామూలుగా ఈ నూనె పెట్టి గంట తర్వాత తలస్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
* అరటిపండును గుజ్జుగా చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ పెట్టి తలస్నానం చేయాలి. దీంట్లో ఉండే కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా పనిచేసి జుట్టు చిట్లడం నివారిస్తుంది.
* అవకాడోని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కొబ్బరి నూనె కలిపి జుట్టు చివర వరకు అంటేలా రాయాలి. కాసేపు మసాజ్ చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
* మయోన్నైస్‌ని తలకు రాసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కావాలనుకుంటే మైల్డ్ షాంపూని వాడొచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్లు జుట్టు చిట్లడాన్ని నివారిస్తాయి.

3044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles