కొవ్వు క‌రిగించే సూప్‌..!


Tue,January 3, 2017 04:18 PM

అధిక బ‌రువు... నేడు చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఏటా అనేక మంది స్థూల‌కాయంతో వివిధ ర‌కాల ఇత‌ర అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. దీంతో ఆ అధిక బ‌రువును త‌గ్గించ‌డం కోసం వారు అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను కూడా పాటిస్తున్నారు. అయితే కేవ‌లం అవే కాకుండా కింద ఇచ్చిన విధంగా ఓ సూప్‌ను త‌యారు చేసుకుని దాన్ని నిత్యం తాగుతుంటే దాంతో కేవ‌లం వారం రోజుల్లోనే శ‌రీరంలో ఉన్న కొవ్వును క‌రిగించ‌డం ప్రారంభించ‌వ‌చ్చు. దాంతో త‌క్కువ రోజుల్లోనే అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాట్ బ‌ర్నింగ్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు...
క్యాబేజ్ పెద్దది - 1
బీన్స్ - 10
టమాటాలు - 4
కొత్తిమీర - 1 కట్ట
క్యారెట్లు - 3
పొడవాటి ఉల్లికాడలు - 2
ఉప్పు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్

తయారీ విధానం...
క్యాబేజీ, టమాటాలు, క్యారెట్, బీన్స్, ఉల్లికాడలు అన్నింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాన్ లో వేసుకుని, దానికి ఉప్పు, మిరియాలపొడి కలపాలి. సరిపడా నీళ్ళు పోసి 10 నిముషాలు స్టవ్ పై ఉడికించాలి. తర్వాత మంటను పూర్తిగా తగ్గించి సిమ్ లో పెట్టి, వెజిటేబుల్స్ మెత్తబడే వరకూ ఉడికించాలి. రెగ్యులర్ ఫుడ్స్ తో పాటు, ఈ ఫ్యాట్ బర్నింగ్ సూప్ ను కూడా తాగాలి. దీంతోపాటు రాత్రి భోజనం తర్వాత నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ జ్యూస్ తాగినన్ని రోజులు ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైలు, బ్రెడ్, మైదా ఐటమ్స్ తినడం మానేయాలి. వారం రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగితే అనూహ్యంగా బరువు తగ్గుతారు.

9769
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS