శనివారం 08 ఆగస్టు 2020
Health - Aug 02, 2020 , 19:18:41

బరువు తగ్గాలంటే ఇది తినాల్సిందే

బరువు తగ్గాలంటే ఇది తినాల్సిందే

బరువు తగ్గడానికి, తిరిగి సరైన ఆకారంలోకి రావడానికి చేసే ప్రయాణం ఖచ్చితంగా సులభం కాదని అందరికీ తెలుసు. అయితే, బొడ్డు చుట్టూ పేరుకుపోయే కొవ్వును తొలగించడం సులభంగా లభించే సప్లిమెంట్స్, డిటాక్స్ రసాలతో సులువైన మార్గం కోసం వెతకడానికి ముందు.. మీ బరువు తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం, కఠినమైన వ్యాయామ దినచర్యకు ప్రత్యామ్నాయం లేదని అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో బరువు తగ్గించే ప్రయాణాన్ని పెంచడానికి మన ప్రాచీన జ్ఞానం నుంచి కొద్దిగా సహాయం తీసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మన వంటింట్లో లభించే పసుపు చాలా ఉపయోగకారిణిగా చెప్పుకోవాలి.

పసుపు ఇంటిల్లిపాదికి ఒక ఆయుర్వేద ఔషధం. మసాలా దినుసుగా నిత్యం వంటల్లో వాడే ఈ అద్భుతమైన ఔషధం అనేక వ్యాధులను నివారిస్తుంది. ఆర్థరైటిస్, అల్జీమర్స్ వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్ లను నయం చేయడానికి కూడా పసుపును ఉపయోగిస్తారు. పసుపును పసుపు రంగులోకి మార్చే కర్కుమిన్ అనే పోషకం. ఇది ఎన్నో వ్యాధి నిరోధక లక్షణాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

పసుపులో ఉండే కర్కుమిన్ శరీర ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊబకాయం లేదా స్థూలకాయంకు కారణమయ్యే కొవ్వు కణాలు పరిపక్వత చెందకుండా ఈ పోషకాలు నిరోధిస్తాయి. అవసరమైన స్థాయిలో కొవ్వు ఉన్నప్పటికీ బరువు పెరగకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఉండే తెలుపు కొవ్వును గోధుమ కొవ్వుగా మార్చడంలో సహకరిస్తుంది. తెల్ల కొవ్వు అంటే చర్మం కింద, ముఖ్యమైన అవయవాల చుట్టూ, ముఖ్యంగా నడుము వద్ద నిల్వ చేరిన కొవ్వు. ఊబకాయానికి ఈ తెల్లటి కొవ్వు ప్రధాన కారణం. బ్రౌన్ ఫ్యాట్ అనేది శారీరక శ్రమతో తినే కొవ్వు, బరువు పెరగడాన్ని నిరోధించడమే కాకుండా కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా తగ్గించడమే కాకుండా ఊబకాయం తగ్గిస్తుంది.

నిత్యం ఉదయాన్నే పసుపుతో టీకాచుకుని సేవించడం వల్ల నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొలగించడమే కాకుండా.. వివిధ వ్యాధులు రాకుండా చూసుకునే వీలుంటుందని పలువురు వైద్యనిపుణులు సూచిస్తున్నారు.


logo