మంగళవారం 27 అక్టోబర్ 2020
Health - Sep 27, 2020 , 17:19:16

లైంగిక సామర్థ్యాన్నిపెంచే ఈ దివ్యౌషధం గురించి తెలుసా..?

లైంగిక సామర్థ్యాన్నిపెంచే ఈ దివ్యౌషధం గురించి తెలుసా..?

హైదరాబాద్ : లైంగిక సామర్థ్యాన్నిపెంపండించడంలో దీనికి మించిన దివ్యౌషధం మరొకటి లేదు. అదే  ఆశ్వగంధ అనే మూలిక. ఇది మన జీవితాల్లోకి వచ్చిన అత్యంత అద్భుతమైన మూలికలలో ఒకటి. ఇది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మూలికగా పరిగణిస్తారు. మన పూర్వీకులు దీనిని వేల సంవత్సరాలుగా వాడుతున్నారు. ఇది భారతదేశంలో విస్తృతంగా అందుబాటులో ఉండే హీలింగ్ హెర్బ్ ఇది.  ఇప్పటికీ ఒక శక్తివంతమైన కామోద్దీపన చేయగలదని భావిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది ప్రజలు వివిధ లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆశ్వగంధ అన్ని లైంగిక సంబంధిత సమస్యల నివారిణకు ఇది సరైన పరిష్కార మార్గం గా నిలుస్తున్నది. దీనిని వినియోగిస్తే, ముఖ్యంగా పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. నరాల బలహీనతను ఈ చూర్ణం దూరం చేస్తుంది. ఎండిన వేర్లు అధిక ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని పొడి ఔషధంగా ఉపయోగిస్తారు.

ఆశ్వగంధ మూలికలను వినియోగించడం వలన వీర్యకణాల సంఖ్య , నాణ్యత పెరిగి తద్వారా సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయట. ఇది నరాల బలానికి, పునరుత్పత్తి అవయవాలు యవ్వనానికి , శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. ఈ మూలిక రక్తపోటును తగ్గించటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఈ మూలికను వినియోగిస్తే చక్కెర స్థాయిలను తగ్గించి నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ నివారణ , కీళ్ల వాపును తగ్గించే సామర్ధ్యం ఉన్నది. ఈ మూలిక ఆకలిని పెంచడంతోపాటు , జీర్ణక్రియ సంబంధ సమస్యలను నయం చేస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారు ఈ మూలికను వినియోగించవచ్చు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి శాంతియుత నిద్రను అందిస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo