గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 17, 2020 , 08:00:07

రక్తాన్ని పెంచే ఇనుము సులభంగా శరీరానికి చేరాలంటే...

రక్తాన్ని పెంచే ఇనుము సులభంగా శరీరానికి చేరాలంటే...

ఆడపిల్లల్లో రక్తహీనత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎదిగే వయసులో సరైన పోషకాలు అందకపోతే తరువాత రకరకాల సమస్యలు వస్తాయి. ఆడపిల్లలకు రక్తవృద్ధిని పెంచే ఇనుము ఉండే ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. అయితే చాలా సందర్భాల్లో ఇనుము ఎక్కువగా లభించే బీట్‌రూట్లు, చిక్కుళ్లను తరచూ తీసుకున్నా రక్తవృద్ధి కనిపించదు. ఇందుకు కారణం చిన్న పొరపాట్లే. అందుకే...

- సాధారణంగా చికుక్కళ్ల వంటి కూరగాయల కన్నా చేపలు, ఇతర మాంసాహారం ద్వారా లభించే ఇనుమును మన శరీరం చాలా త్వరగా, ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి కూరగాయలతో పాటు కొద్ది మాంసాహారాన్ని కూడా తీసుకుంటే ఇనుము శోషణ బాగుంటుంది. 

- కూరగాయల నుంచి శరీరానికి ఇనుము సులభంగా చేరాలంటే వీటితో పాటు విటమిన్‌-సి లభించే నారింజ, బత్తాయి, టొమాటో వంటి సిట్రస్‌ పండ్లు కూడా తీసుకోవాలి. సిట్రస్‌ ఫలాలు ఇనుము శోషణను వేగవంతం చేస్తాయి. భోజనం కాగానే ఈ పండు తీసుకుంటే బావుంటుంది.

- గోధుమ అన్నం, వరి, జొన్నలు, సజ్జలు, చింతపండు వంటి వాటిలో ఉండే టానిన్లు ఆకుకూరల నుంచి లభించే ఇనుము శరీరానికి చేరకుండా అడ్డుకుంటాయి. కాబట్టి ఆకుకూరలను పైవాటితో కలిపి తీసుకోకూడదు. 

- అల్పాహారం లేదా భోజనం చేయగానే టీ, కాఫీలు తాగడం చాలామందికి అలవాటు. కాని ఇవి ఇనుమును శరీరం గ్రహించకుండా ఆటంకపరుస్తాయి. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం మంచిది. logo