గురువారం 24 సెప్టెంబర్ 2020
Health - Jun 17, 2020 , 20:22:59

నోటి దుర్వాస‌న వ‌స్తుందా? అయితే జాగ్ర‌త్త‌!

నోటి దుర్వాస‌న వ‌స్తుందా? అయితే జాగ్ర‌త్త‌!

నోటి దుర్వాస‌న వ‌స్తుందం‌టే నోరు స‌రిగా శుభ్ర‌ప‌రుచుకోలేదు. అది నోటికి సంబంధించిందే అనుకుంటాం. అలా అనుకుంటే పొర‌పాటే. కొన్నిసార్లు నెగ‌టివ్ ఆలోచించ‌డం కూడా మంచిదే. చెడు శ్వాస అనారోగ్యానికి సంకేతం. స‌రిగా బ్రెష్ చేసుకున్నా కూడా చెడు వాస‌న వ‌స్తుంటే అనుమానించాల్సిందే.. నోరు పొడిబారితే లాలాజ‌లంలో ఉండే యాంటీబ్యాక్టీరియ‌ల్ త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా నోరు చెడు శ్వాస‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. ఇలా ఉన్న‌ప్పుడు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. ఈ స‌మ‌స్య ఉంటే ఇంకా ఏవేం జ‌రుగుతాయో తెలుసుకోండి.

* కిడ్నీలు స‌రిగా ప‌నిచేయ‌క‌పోతే ర‌క్తంలో ఉండే వ్య‌ర్థాలు, మ‌లినాలు పేరుకుపోతాయి. ఆ ప్ర‌భావం నాలుక‌పై ఉండే టేస్ట్ బ‌డ్స్ (రుచి గుళిక‌లు)పపై ప‌డుతుంది. ఫ‌లితంగా తినే ఆహారం రుచిగా అనిపించ‌దు.  

* నోటి శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, అల‌ర్జీలు వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా దుర్వాస‌న వ‌స్తుంది. 

* టాన్సిల్ స్టోన్స్ వ‌ల్ల కూడా మీ నోటి నుంచి భ‌రించ‌లేనంత చెడు వాస‌న వ‌స్తుంది. కాబ‌ట్టి ఒక‌సారి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం ఉత్త‌మం. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు, చెడు అల‌వాట్ల వ‌ల్ల కూడా నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుంది.

నోటి నుంచి మాత్ర‌మే దుర్వాస‌న వ‌స్తుంటే ఇలా చేయాలి :

*  ఆహారం తీసుకున్న త‌ర్వాత నీటితో నోరు పుక్కిలించి ఊసేయాలి. నోటిలో ఆహారం ఎక్కువ‌సేపు ఉన్న‌ట్ల‌యితే బ్యాక్టీరియా ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. 

* రోజూ ఆపిల్ గాని క్యారెట్లు తిన‌డం వ‌ల్ల నోటిపై ఉండే మ‌లినాల‌ను తొల‌గించ‌వ‌చ్చు.

*  కాఫీ ఎక్కువ‌గా తాగినా స‌రే దుర్వాస‌న ఎక్కువ‌గా వ‌స్తుంది.

*  కాఫీకి బ‌దులు గ్రీన్ టీ తాగండి. ఎందుకంటే గ్రీన్ టీ శ్వాస‌ను మెరుగుప‌రుస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.


logo